logo

బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో ఇదే..

బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో ఇదే..

అన్ని పార్టీలు ప్రచారంలో దూసుకుపోతూ.. ఓటర్లను ఆకర్షించేదుకు భలే భలే మేనిఫెస్టోలు తయారు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో బీజేపీ కూడా మానిఫెస్టోకు రూపకల్పన చేసింది తాము అధికారంలోకి వస్తే ఏమి చేస్తామన్న దానిపై మానిఫెస్టోలో పొందుపరిచింది. అధికారంలోకి రాగానే పెట్రోల్, డీజిల్‌పై రాష్ట్రం అదనంగా వడ్డిస్తున్న వ్యాట్‌ను తొలగిస్తామని ప్రకటించారు. వక్ఫ్‌, ఎండోమెంట్‌, క్రైస్తవ దేవాలయాల భూమల పరిరక్షణకు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేస్తామన్నారు. పోటీ పరీక్షల్లో పాల్గొనే విద్యార్థులకు పూర్తిస్థాయి శిక్షణను ప్రభుత్వమే అందిస్తుందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీలు, పంచాయతీల్లో పారిశుద్ధ విభాగాల్లో పనిచేసే ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను శాశ్వత ఉద్యోగులుగా నియమిస్తామన్నారు. ప్రాధాన్యత క్రమంలో ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తామని తెలిపారు. అన్ని కులాల్లో ఉన్న పేదలకు నిధులు చేరేలా కార్యాచరణ రూపొందిస్తామని. దీక్షలు తీసుకునే స్వాములకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని చెప్పారు. దసరా, సంక్రాంతి వంటి పండుగల వేళ బస్సు ఛార్జీలు పెంచే సంప్రదాయానికి స్వస్తి చెబుతామని బీజేపీ పేర్కొంది. అలాగే ప్రతి కుల కార్పొరేషన్ కు ప్రత్యేక నిధులు ఇచ్చి ఆ ఏడాదికి ఆ ఏడాదే ఖర్చు చేస్తాం.. excise శాఖని ఆదాయ వనరుగా చూడకుండా.. 6 గంటలకు మద్యం బండ్.వారంలో 5 రోజులు మాత్రమే అమ్మకాలు జరిగేలా చర్యలు తీసుకుంటాము.

nanireddy

nanireddy

Our Contributor help bring you the latest article around you


లైవ్ టీవి

Share it
Top