రజనీకాంత్ రాజకీయ ప్రకటనపై మండిపడ్డ సుబ్రమణ్య స్వామి

ఆయన ప్రత్యర్ధులపై ఏదో మామూలుగా ఆరోపణలు చేసి వదిలేయరు..వాటిని నిరూపించేదాకా పట్టువదలని విక్రమార్కుడు. వదల ...
ఆయన ప్రత్యర్ధులపై ఏదో మామూలుగా ఆరోపణలు చేసి వదిలేయరు..వాటిని నిరూపించేదాకా పట్టువదలని విక్రమార్కుడు. వదల బొమ్మాలి నిన్నొదల అంటూ తను వేసిన కేసుల్ని తానే శోధించి వాదించి సాధిస్తారు. ఆయనే వన్ అండ్ ఓన్లీ స్వామి..సుబ్రమణ్యస్వామి. ఈ బీజేపీ నేత సుబ్రమణ్య స్వామి అల్లర చిల్లర ఆరోపణలు అస్సలు చేయరు. ఆయన నోటి నుంచి వచ్చిదంటే కాగితాల ఆధారాలు ఉండే ఉంటాయి. ఇంతవరకు కేసులు అన్ని ఇలాగే ఉన్నాయి. తమిళనాడు మాజీ సీఎం జయలలిత ఆదాయానికి మించి ఆస్తుల కేసులో కటకటాల్లోకి పంపి చుక్కులు చూపించారు. అదే కేసులో శశికళను ఊచలు లెక్కి పెట్టించారు. 2జీ స్పెక్ట్రమ్ కేసులో మారన్ , కనిమొళిల్ని ముప్పతిప్పలు పెట్టించారు. ఇలా ఏ కేసు చూసినా స్వామిదే పై చేయి.
అయితే గతంలో రజనికాంత్ రాజకీయం రంగప్రవేశంపై విమర్శలు చేశారు. సూపర్ స్టార్ కి రాజకీయాల్లోకి వస్తే అట్టర్ ఫ్లాప్ అవుతారని అన్నారు. అంతేకాదు వైద్యనిమిత్తం అమెరికా వెళ్లిన రజనీ ఓ కాసినోలో గ్యాంబ్లింగ్ ఆడుతున్న ఫొటోను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఆరోగ్యాన్ని మెరుగు పరచుకోవడం కోసం ఆర్కే 420 గ్యాంబ్లింగ్ ఆడుతున్నాడా? అతనికి ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో ఈడీ విచారణ జరపాలి అని స్వామి డిమాండ్ చేశారు.
తాజాగా తాను రాజకీయాల్లోకి వస్తున్నానంటూ ప్రకటించిన రజనీకాంత్ పై విమర్శనాస్త్రాలు సంధించారు. నిరక్షరాస్యుడైన రజనీకాంత్.. తమిళ ప్రజలకు ఏం నేర్పిస్తాడని అని అన్నారు. ఆర్కేనగర్ ఎన్నికల్లో టీటీవీ దినకరన్ గెలుపును గుర్తుచేశారు. శివాజీ గణేషన్ రజనీకాంత్ కంటే గొప్ప వ్యక్తి.. ఆయనే రాజకీయాల్లోకి వచ్చి ఏం చేయలేకపోయారని...రజనీకాంత్ ముందు తన పార్టీ విధివిధానాలను ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు.
TS EAMCET: తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల..
12 Aug 2022 6:14 AM GMTప్రకాశం జిల్లా సింగరాయకొండ హైవేపై ప్రయాణికుల ఇబ్బందులు
11 Aug 2022 5:25 AM GMTకామెన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం సాధించిన ఆకుల శ్రీజ
11 Aug 2022 2:44 AM GMTజనసేనలోకి వెళ్తున్న ప్రచారాలను ఖండించిన బాలినేని
10 Aug 2022 7:08 AM GMTప్రకాశం బ్యారేజీకి భారీగా చేరుతున్న వరద
10 Aug 2022 5:45 AM GMTహైదరాబాద్‌కు రానున్న టీకాంగ్రెస్ ఇన్చార్జ్ మాణిక్కం ఠాగూర్
10 Aug 2022 5:32 AM GMT
మునుగోడు టీఆర్ఎస్లో అసమ్మతిసెగ.. ఆయనకు టిక్కెట్ ఇస్తే ఓడిస్తాం..
12 Aug 2022 4:00 PM GMTముంబై జట్టుకు గుడ్‌బై చెప్పనున్న అర్జున్ టెండూల్కర్!
12 Aug 2022 3:30 PM GMTBaby Powder: బేబీ పౌడర్‌తో క్యాన్సర్.. జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ...
12 Aug 2022 3:00 PM GMTInvest Money: వీటిలో పెట్టుబడి పెడితే మీ డబ్బులు రెట్టింపు..!
12 Aug 2022 2:30 PM GMTHeavy Rains: కొట్టుకుపోయిన ఏటీఎం.. అందులోని 24 లక్షల నగదు..
12 Aug 2022 2:00 PM GMT