ఏపీలో అవీనితిని త‌వ్వేందుకు బుల్డోజ‌ర్ల‌కు డిమాండ్

ఏపీలో అవీనితిని త‌వ్వేందుకు బుల్డోజ‌ర్ల‌కు డిమాండ్
x
Highlights

ఏపీ బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఏపీలో జ‌రిగే అవినీతిపై నిప్పులు చెరిగారు. అవినీతిని త‌వ్వాలంటే బుల్డోజ‌రే కావాల‌ని రాష్ట్రంలో అవినీతిపై కాగ్...

ఏపీ బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఏపీలో జ‌రిగే అవినీతిపై నిప్పులు చెరిగారు. అవినీతిని త‌వ్వాలంటే బుల్డోజ‌రే కావాల‌ని రాష్ట్రంలో అవినీతిపై కాగ్ నివేదికే నిద‌ర్శ‌న‌మ‌ని అన్నారు. ఈ సంద‌ర్భంగా ఏపీలో అన్నీ ప్రాజెక్ట్ లో అవినీతి తారాస్థాయిలో ఉంద‌న్న ఆయ‌న .ప‌లు ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం చెప్పాల‌ని ఏపీ ప్ర‌భుత్వానికి స‌వాల్ విసిరారు.
రూ.1120కోట్లతో అయ్యే పట్టిసీమకు రూ.1660కోట్లు
మట్టి తీయడానికే 67కోట్లు
స్పీల్ వేలో రూ.1400 ఖర్చు
పంపు సెట్లకు రూ.340 కోట్ల ఖర్చు
జన్మభూమి కమిటీల్లో అవినీతి
ప్రభుత్వం మంజూరు చేసే ఇళ్ల నిర్మాణం కోసం రూ.20వేల లంచం
కట్టని బాత్రూంలకు ఒక్కో మండలానికి రూ.5కోట్లు
చెట్టునీరుకు రూ.4వేల కోట్లు ఖర్చు
ఎన్ఆర్ఈజీఎస్ కింద 27వేల కోట్లలో అవినీతి జ‌రిగింద‌ని సూచించారు. కేవ‌లం రూ.10వేల కోట్ల మ‌ట్టిని అమ్మార‌ని అన్నారు. ఇసుక లారీకు రూ.2వేలు వసూలు చేస్తున్నారని.. ఈ సొమ్మంతా ఎక్కడ పోతోందని సోము వీర్రాజు ప్రశ్నించారు. అవినీతిని డీ సెంట్రలైజ్ చేస్తున్నారని మండిపడ్డారు.
సర్వ శిక్షా అభియాన్ కు రూ.4వేల కోట్లు కేంద్రం ఇస్తే.. ట్రైనింగ్ కోసం రూ.400కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారని తెలిపారు.పోలవరంలో గండికి రూ. 11కోట్లు ఖర్చు చేయడమేంటని ప్రశ్నించారు. ఎత్తిపోతల పథకం అంటే నిధులను ఎత్తేయడమేనని ఎద్దేవా చేశారు. ఇలా ఏపీలో జ‌రుగుతున్న అవినీతిపై తాను విజిలెన్స్ క‌మిటీకి ఫిర్యాదు చేశామ‌ని వెల్ల‌డించారు. చంద్రబాబు నాయుడు గంటలు గంటలు అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. గంటలు గంటలు మాట్లాడితే ఆయన ఆరోగ్యాన్ని, రాష్ట్రాన్ని ఎవరు కాపాడతారని చురకలంటించారు.
హుధుద్ కోసం రూ.25వేల కోట్ల నష్టమని ఏపీ ప్రభుత్వం చెప్పిందని, అంతేగాక, ఏయూలో అద్దాలు పగిలితే రూ.250 కోట్లు అన్నారని సోము వీర్రాజు చెప్పారు. అయితే, కేంద్రం నిధులిస్తే.. యూసీలు మాత్రం రూ.700కోట్లు మాత్రమే ఏపీ ఇచ్చిందని మండిపడ్డారు. అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి ఏపీని పట్టించుకోకుండా సమైక్యాంధ్ర అంటూ ఉద్యమం చేశారని, ఇప్పుడు కూడా అదే జరుగుతోందని అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories