భర్తను చంపేందుకు భార్య భారీ కుట్ర.. అనూహ్యంగా చివరకు..

భర్తను చంపేందుకు భార్య భారీ కుట్ర.. అనూహ్యంగా చివరకు..
x
Highlights

మరోవ్యక్తితో వివాహేతర సంబంధం బయటపడటంతో భర్తను అడ్డుతొలగించుకోవాలని భార్య భారీ ప్లాన్ వేసింది. చివరకు అది వికటించడంతో అనూహ్యంగా పోలీసులకు చిక్కి ...

మరోవ్యక్తితో వివాహేతర సంబంధం బయటపడటంతో భర్తను అడ్డుతొలగించుకోవాలని భార్య భారీ ప్లాన్ వేసింది. చివరకు అది వికటించడంతో అనూహ్యంగా పోలీసులకు చిక్కి జైల్లో ఊచలు లెక్కబెడుతోంది. వివరాల్లోకి వెళితే విశాఖ ఏజెన్సీ సీలేరులో బీజేపీ నాయకుడు, వ్యాపారి కారె అప్పలరాజుపై శుక్రవారం అర్ధరాత్రి జరిగిన హత్యాయత్నం కేసు మిస్టరీ వీడింది. తూర్పుగోదావరి జిల్లా తొండంగి మండలం వేమవరం గ్రామానికి చెందిన జేసీబీ డ్రైవర్ నేమాల శ్రీనివాస్‌ కు అప్పలరాజు భార్య మహేశ్వరికి వివాహేతర సంబంధం ఉంది. ఈ విషయం భర్తకు తెలిసి హెచ్చరించాడు. అయినా భర్తమాటను ఖాతరు చేయని మహేశ్వరి అనైతికబంధాన్ని కొనసాగిస్తోంది. దీంతో అప్పలరాజు ఆమెను వేధించడం మొదలుపెట్టాడు. ఈ విషయాన్ని ఆమె ప్రియుడు శ్రీనివాస్‌కు చెప్పడంతో అతడిని అడ్డుతొలగించేందుకు పథకం రచించాడు.

అందులో భాగంగా తనతోపాటు జేసీబీ ఆపరేటర్లుగా పనిచేస్తున్న కొరుప్రోలు ప్రసాద్‌ (25), సర్వసిద్ధి దుర్గ (22)ను శ్రీనివాస్‌ ఒప్పించాడు. దీంతో శుక్రవారం అర్ధరాత్రి అప్పరాజు ఇంటికి చేరుకున్నారు. అంతకుముందే భార్య మహేశ్వరి అప్పలరాజుకు ఆహారంలో నిద్ర మాత్రలు కలిపింది. ఘాడ నిద్రలో ఉన్న అప్పలరాజును చంపేదుకు ప్రయత్నించారు. అతని కాళ్ళు చేతులు కట్టేసి వృషణాలు తొక్కేందుకు ప్రయత్నించారు. కానీ అదృష్టవశాత్తు అప్పలరాజుకు మెలుకు వచ్చింది. ఈ క్రమంలో ఏమి జరుగుతోందో అర్ధం కాక భయంతో కేకలు వేశాడు. ఈ మధ్యలో శ్రీనివాస్, అప్పలరాజుకు మధ్య పెనుగులాట జరిగింది. ఎవరైనా ఇంట్లోకి వస్తే అసలు విషయం బయటపడుతుందని ఉహించి శ్రీనివాస్, దుర్గ, ప్రసాద్ లు అక్కడినుంచి జారుకున్నారు. అప్పలరాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. విచారణలో భాగంగా నిందితులు వదిలిన వస్తువుల ఆధారంగా హత్యాయత్నానికి పథకం పన్నింది శ్రీనివాస్ అని అర్ధమైంది. ఇందుకు అప్పలరాజు భార్య మహేశ్వరి సహకరించిందని తేల్చారు. ప్రస్తుతం శ్రీనివాస్ పరారీలో ఉండగా మహేశ్వరి, దుర్గ, ప్రసాద్ లను అదుపులోకి తీసుకున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories