logo

వైసీపీ - టీఆర్ఎస్ ఎంపీల‌తో బీజేపీ ర‌హ‌స్య‌ మంత‌నాలు..?

వైసీపీ - టీఆర్ఎస్ ఎంపీల‌తో బీజేపీ ర‌హ‌స్య‌ మంత‌నాలు..?

పార్లమెంట్ అవిశ్వాస తీర్మానంపై చర్చ జరగడం లేదు. కనీసం తీర్మానాన్ని ఆమోదించే సాహసం కూడా కేంద్రం చేయలేకపోతోంది. రహస్య మిత్రులతో సభను వాయిదా వేయించేసి.. వినోదం చూస్తోంది. దేశవ్యాప్తంగా విమర్శలు వస్తూండటంతో ఇప్పుడు రూటు మార్చింది. పార్లమెంటరీ మంత్రి అనంతకుమార్ ఈ మేరకు.. రహస్య మిత్రుల నుంచి.. బహిరంగ మిత్రుల వరకు స్టేటస్ మార్చుకుంటున్న టీఆ్ఎస్, వైసీపీ ఎంపీలతో అందరి ముందుగానే చర్చలు జరిపారు. వాయిదాల పద్దతి వలన.. ప్రభుత్వంపై విమర్శలు పెరుగుతూండటంతో ఏదో ఒకటి చేయాలని డిసైడయ్యారు. అందుకే టీఆర్ఎస్, వైసీపీ నేతలతో చర్చలు జరిపారు.

ఇప్పటికే టీఆర్ఎస్ ఎంపీలు.. కేంద్రానికి అవిశ్వాస తీర్మానం విషయంలో పూర్తి స్థాయిలో సహకరిస్తున్నారు. అన్నాడీఎంకే ఎంపీలకు తోడులాగ వెల్ లోకి వెళ్లి సభను వాయిదా వేయడానికి సహకరిస్తున్నారు. ఇప్పుడు అనంతకుమార్ వారితో చర్చలు జరపడంతో వ్యూహం మార్చే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది. వైసీపీ నేతలు ఇప్పటికే … ఏపీలో ఓ పోరాటం… ఢిల్లీలో మరో తరహా పోరాటం చేస్తున్నారు. ఇప్పుడు వారు కూడా వ్యూహం మార్చనున్నట్లు తెలుస్తోంది. ప్రతీ రోజూ వాయిదాల పద్దతితో దేశవ్యాప్తంగా .. అవిశ్వాసం అంశం.. రోజూ చర్చనీయాంశమవుతోంది. అలా కాకుండా ఒక్కసారే వాయిదా వేసి పడేస్తే.. ఒకటి రెండు రోజుల తర్వాత అంతా సద్దుమణుగుతుందని బీజేపీ పెద్దలు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.
దీనికి సంబంధించిన వ్యూహాన్ని అనంతకుమార్ సిద్ధం చేసి… ఎలా వ్యవహరించాలో.. టీఆర్ఎస్, వైసీపీ ఎంపీలకు చెప్పినట్లు తెలుస్తోంది. దీని ప్రకారం.. రేపు టీఆర్ఎస్, వైసీపీ ఎంపీల ఆందోళన మరింత ఉద్ధృతం కానుంది. దీన్ని సాకుగా చూపి.. పార్లమెంట్ ను నిరవధికంగా వాయిదా వేసే ఆలోచనను ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది.

lakshman

lakshman

Our Contributor help bring you the latest article around you


లైవ్ టీవి

Share it
Top