logo
ఆంధ్రప్రదేశ్

క‌ల్యాణ్ దిలీప్ సుంక‌ర‌కు షాకిచ్చిన ప‌వ‌న్ క‌ల్యాణ్..?

క‌ల్యాణ్ దిలీప్ సుంక‌ర‌కు షాకిచ్చిన ప‌వ‌న్ క‌ల్యాణ్..?
X
Highlights

బీజేపీతో పవన్ కళ్యాణ్ కి అవగాహన కుదిరిందా? జనసేనానిని కమలం పార్టీ నేతలే చంద్రబాబు మీదకు ఎగదోస్తున్నారా? పైకి...

బీజేపీతో పవన్ కళ్యాణ్ కి అవగాహన కుదిరిందా? జనసేనానిని కమలం పార్టీ నేతలే చంద్రబాబు మీదకు ఎగదోస్తున్నారా? పైకి కమ్యూనిస్టులతో స్నేహం చేస్తున్న పవన్ లోపల మరో మనిషి ఉన్నారా? సైద్ధాంతికంగా… రాజకీయంగా కూడా పైకి కనిపించే పవన్ కి లోపలి మరో మనిషికి వైరుధ్యం ఉందా? ఈ ప్రశ్నలన్నింటికి టీడీపీ శ్రేణుల నుంచి అవుననే సమాధానమే వస్తోంది. తాజాగా జనసేన చేపట్టిన పార్టీ నియామకాలను చూస్తే సాధారణ జనం కూడా టీడీపీ చేస్తున్న ఆరోపణలు నిజమే అంటున్నారు. బీజేపీకి పవన్ పార్టీకి మధ్య ఏదో జరుగుతుంది అని మాత్రం ప్రజలు భావిస్తున్నారు. తాజాగా పవన్ కళ్యాణ్ పార్టీ తరపున వాయిస్ వినిపించేందుకు కొందరిని ఎంపీక చేశారు. ఆ ఎంపికె ఇప్పుడు జనసేన… బీజేపీ సంబంధాల గురించి జనం చర్చించుకునే పరిస్థితి కారణం అయింది.
పవన్ కళ్యాణ్ చేసిన ఈ నియామకాల్లో పార్టీ కోసం కష్టపడుతున్న, ఆయన అభిమాన సంఘాల్లో ముఖ్యమైన వారిని కాదని బీజేపీ నుంచి వచ్చిన వారిని నియమించడం కొత్త చర్చకు దారి తీసింది. జనసేన పార్టీ యాక్టివ్ మెంబర్.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమాన సంఘం నాయకుడు దిలీప్. జనసేన తరఫున పవన్ తరవాత ఆ రేంజులో స్పీచ్ ఇవ్వగల సమర్థుడని పార్టీ శ్రేణులు అంటుంటాయి. పవన్‌ను విమర్శించే వారిపై ప్రతివిమర్శలు చేయడంలో దిలీప్ సుంకర ముందు వరుసలో ఉంటారు. జనసేన కార్యకర్తగా టీవీ చానెల్స్ డిబెట్‌‌లలో పాల్గొనడంలో.. ప్రత్యర్థికి కౌంటర్లు వేయడంలో దిట్ట అని పవన్ అభిమానులు చెప్పుకుంటూ ఉంటారు. పార్టీ తరఫున ఎలాంటి విషయాలైనా.. సోషల్ మీడియా వేదికగా ఇతర పార్టీల నేతలకు, కార్యకర్తలకు దీటుగా సమాధానమివ్వడంలో కల్యాణ్ దిలీప్ సుంకర ముందుంటారు. మరీ ముఖ్యంగా పవన్ అభిమానులకు, సినీ విమర్శకుడు కత్తి మహేశ్ మధ్య సుమారు ఏడాది పాటు నెలకొన్న గొడవలను సైతం దిలీపే పరిష్కరించారని చెబుతుంటారు. అయితే ఆయనకు పార్టీ తరఫున ఏదో ఒక మంచి పదవి ఇస్తారని అందరూ అనుకున్నారు. కానీ ఇంతవరకూ ఆ దాఖలాల్లేవ్.!. అంతేకాదు దిలీప్ అనర్గలంగా మాట్లాడే వ్యక్తి గనుక కచ్చితంగా జనసేన స్పోక్స్ పర్సన్ పార్టీ కార్యకర్తలు భావించారు.
కానీ ఏపీకి ఇచ్చిన హామీలను కేంద్రం అమలు చేయకపోవడంతో బీజేపీకి గుడ్ బై చెప్పిన అద్దేపల్లి శ్రీధర్‌‌ను జనసేన స్పోక్స్ పర్సన్‌‌ పదవి వరించింది. ఈ విషయంపై కత్తి మహేశ్ ట్విట్టర్ వేదికగా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. “అంటే అన్నాం అంటారు గానీ! కొత్తగా ఎవరూ లేనట్టు మాజీ బీజేపీ నాయకుడు అద్దేపల్లి శ్రీధర్ ను జనసేన స్పోక్స్ పర్సన్ చెయ్యడమేమిటి! ఇన్నాళ్లూ గొంతెత్తి జనసేన గళం వినిపిస్తున్న యువనాయకుడు కళ్యాణ్ దిలీప్ సుంకర లాంటివాళ్లకు అన్యాయం కదా!?!” అని కత్తి ట్వీట్ చేశారు. గతంలో కత్తి మహేష్ పవన్ మీద ఏ కామెంట్ పెట్టిన ఇంతెత్తున లేచి ఆయన అభిమానులు ఇప్పుడు మాత్రం సైలెంట్ అవడం గమనార్హం. అలాగే కత్తి ట్వీట్‌‌కు చాలా వరకు పాజిటివ్‌‌గానే రిప్లైలు వస్తున్నాయి. కొందరు నెటిజన్లు అయితే ‘ఇది ఆలోచించాల్సిన విషయమే’ అంటూ కామెంట్ చేస్తున్నారు. దీనికి తోడు ప్రత్యేక హోదా విషయంలో జాతీయ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్ చేసిన వ్యాఖ్యలు… హోదా విషయంలో పెద్దగా పట్టుబట్టాల్సిన అవసరం లేదన్న అర్ధం వచ్చేలా ఆయన మాట్లాడిన తీరు మరిన్ని అనుమానాలకు దారి తీసింది. అయితే ఈ వ్యాఖ్యల మూలంగా జరిగిన నష్టాన్ని ఆలస్యంగా గుర్తించిన జనసేన నేతలు తప్పులు దిద్దుకునే పని చేపట్టారు. హోదా విషయంలో వెనక్కి తగ్గేది లేదని పవన్ వ్యాఖ్యలను ఆ ఛానల్ విలేకరి తప్పుగా అర్ధం చేసుకున్నారని జనసేన వివరణ ఇచ్చింది. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం మాత్రం జరిగిపోయింది.

Next Story