బీసీలకు బర్రెలు, గొర్రెలేనా.. చట్టసభల్లోకి పంపరా?

బీసీలకు బర్రెలు, గొర్రెలేనా.. చట్టసభల్లోకి పంపరా?
x
Highlights

తెలంగాణ రాష్ట్రముఖ్యమంత్రి కెసిఆర్ పై మరోసారి విమర్శలు గుప్పించారు బీజేపీ నేత లక్ష్మణ్. గడిచిన 30సంవత్సరాలుగా 34శాతం రిజర్వేషన్లు వస్తున్నాయని కాని...

తెలంగాణ రాష్ట్రముఖ్యమంత్రి కెసిఆర్ పై మరోసారి విమర్శలు గుప్పించారు బీజేపీ నేత లక్ష్మణ్. గడిచిన 30సంవత్సరాలుగా 34శాతం రిజర్వేషన్లు వస్తున్నాయని కాని ఇప్పుడు మాత్రం ఏ ప్రాతిపదికన దానిని 22శాతానిక కుదించిందో టీఆర్ఎస్ సర్కార్ తక్షణమే సమాధానం చెప్పాలని ల‍క్ష్మణ్ డిమాండ్ చేశారు. ఐదేండ్లలో ఎలాంటి గణాంక వివరాలు సమర్పించకుండా ఎలా తగ్గిస్తారని టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణలో జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు పెంచుతామని ఇప్పుడు కెసిఆర్ మాట మార్చేసేరని లక్ష్మణ్ విమర్శించాడు. నిన్న తెలంగాణ ప్రభుత్వం బీజీసీ రిజర్వేషన్లు తగ్గిస్తూ విడుదల చేసిన ఆర్డినెన్సును త‍క్షణమే బేషరుతుగా వెనక్కి తీసుకోవాలని బీజేపీ నేత లక్ష్మణ్ డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం బీసీలకు పేరుకే బర్రెలు, గొర్రెలు ఇవ్వడం తప్ప, చట్టసభల్లో అవకాశం కల్పించేది లేదా? అని ప్రశ్నించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories