నలుగురు మంత్రులను సస్పెండ్ చేసిన బీజేపీ

నలుగురు మంత్రులను సస్పెండ్ చేసిన బీజేపీ
x
Highlights

రాజస్థాన్‌ బీజేపీలో ముసలం మొదలయింది. పార్టీ వ్యక్తిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని నలుగురు మంత్రులపై వేటు వేసింది బీజేపీ. రెబెల్స్‌గా బరిలోకి దిగిన...

రాజస్థాన్‌ బీజేపీలో ముసలం మొదలయింది. పార్టీ వ్యక్తిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని నలుగురు మంత్రులపై వేటు వేసింది బీజేపీ. రెబెల్స్‌గా బరిలోకి దిగిన వారిని బుజ్జగించడానికి కమలనాథులు ప్రయత్నించారు. కానీ 11 మంది దారికి రాలేదు. నామినేషన్లు విత్‌డ్రా చేసుకోడానికి ఒప్పుకోలేదు. దీంతో పార్టీ వారిపై క్రమశిక్షణ చర్యలు చేపట్టింది. 11 మందిని పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి తొలగిస్తున్నట్లు బీజేపీ ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ 11 మందిలో నలుగురు మంత్రులు ఉన్నారు. చాలామంది సిట్టింగ్‌ ఎమ్మెల్యేలను బీజేపీ ఈసారి పక్కన పెట్టింది. వీరందరికీ పార్టీ టికెట్లు ఇవ్వలేదు. దీంతో కొందరు కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. మరికొందరు బీజేపీ రెబెల్స్‌గా రంగంలోకి దిగారు. వీరందరినీ పోటీనుంచి తప్పించాలని చూసిన బీజేపీకి నిరాశ ఎదురైంది. పైగా టిక్కెట్లు దక్కని వారు అధిష్టానంపై తిరుగుబావుటా ఎగురవేశారు. దాంతో పార్టీలో ముసలం మొదలయింది. ఇంతకీ రెబల్స్ మాట వినకపోవడంతో వేటు వేసింది బీజేపీ.

Show Full Article
Print Article
Next Story
More Stories