logo
జాతీయం

బీజేపీ సీఎం అభ్యర్థి ఓటమి..!

బీజేపీ సీఎం అభ్యర్థి ఓటమి..!
X
Highlights

హిమాచల్ ప్రదేశ్ లో బీజేపీ అధికారం దిశగా పరుగులు పెడుతున్న వేళ ఆ రాష్ట్ర బీజేపీ సీఎం అభ్యర్థి ప్రేమ్ కుమార్...

హిమాచల్ ప్రదేశ్ లో బీజేపీ అధికారం దిశగా పరుగులు పెడుతున్న వేళ ఆ రాష్ట్ర బీజేపీ సీఎం అభ్యర్థి ప్రేమ్ కుమార్ ధుమాల్ ఓటమి చెందారు.. తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి చేతిలో అయన భారీ ఓట్ల తేడాతో ఓటమి చవిచూశారు.. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం బీజేపీ 42 స్థానాల్లో ముందంజలో ఉండగా కాంగ్రెస్ 22 స్థానాల్లో ముందంజలో ఉంది.. తుదిపలితాల్లో బీజేపీకి 5 స్థానాల్లో ఖాతా తెరవగా అందులో బీజేపీ సీఎం అభ్యర్థిగా అనుకున్న ధుమాళ్ ఓటమి చెందారు.. దీంతో అధికారంలోకి వస్తుందన్న ధీమాతో ఉన్న ఆ పార్టీకి అయన ఓటమి కొంత నిరుత్సహం తెచ్చిందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది..

ఇదిలావుంటే గుజరాత్ లో కూడా అధికార బీజేపీ దూసుకుపోతుంది.. మొత్త 180 స్థానాలకు గాను బీజేపీ 108 స్థానాల్లో ముందంజలో ఉంది.. కాంగ్రెస్ 72 స్థానాల్లో ముందంజలో ఉండగా ఇతరులు 2 స్థానాల్లో కొనసాగుతున్నారు.. ఇప్పటివరకు అందిన తుది ఫలితాల్లో బీజేపీకి 18 స్థానాలు దక్కగా , కాంగ్రెస్ కు 10 దక్కాయి.. ప్రస్తుత గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపాని , మాజీ ముఖ్యమంత్రి ఆనందిబెన్ పటేల్ లు విజయం సాధించారు..

Next Story