సుప్రీం కోర్టులో బీజేపీకి చుక్కెదురు!

సుప్రీం కోర్టులో బీజేపీకి చుక్కెదురు!
x
Highlights

పశ్చిమబెంగాల్ లో బీజేపీ రథయాత్రకు అనుమతి నిరాకరిస్తూ కోల్‌కత్తా హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన...


పశ్చిమబెంగాల్ లో బీజేపీ రథయాత్రకు అనుమతి నిరాకరిస్తూ కోల్‌కత్తా హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన బీజేపీకి చుక్కెదురైంది. పిటిషన్‌పై అత్యవసర విచారణ అవసరం లేదని సుప్రీం కోర్టు అభిప్రాయపడింది. సాధారణ కేసులలాగానే దీనిని పరిగణించనున్నట్లు కోర్టు స్పష్టం చేసింది. ఇక వివరాల్లోకి వెళితే బీజేపీ జాతీయఅధ్యక్షుడు అమిత్ షా నేతృత్వంలో తలపెట్టిన రథయాత్రకు పశ్చిమబెంగాల్ సర్కార్ అనుమతి నిరాకరిస్తూ తీర్పు ఇచ్చింది. సర్కార్ నిర్ణయాన్ని బీజేపీ సవాల్ చేస్తూ కోల్‌కతా హైకోర్టును సంప్రదించింది. కాగా అక్కడ బీజేపీ స్వల్వ ఊరట లభించింది సింగిల్ బెంచ్ ధర్మాసనం బీజేపీ యాత్రకు అనుమతికి ఓకే చెప్పింది. దింతో బెంచ్ తీర్పును అభ్యంతరం చేస్తూ టీఎంసీ (తృణమూల్ కాంగ్రెస్ పార్టీ) కోల్‌కతా హైకోర్టు పిటిషన్ వెసిన విషయం తెలిసిందే. కాగా చీఫ్ జస్టిస్ తీర్పును సవాల్ చేస్తూ బీజేపీ సుప్రీం కోర్టును సంప్రదించాడు దింతో అత్యవసర విచారణ అవసరం లేదని స్పష్టం సుప్రీం కోర్టు చేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories