కేంద్రంలో చ‌క్రం తిప్పుతున్న వైఎస్ జ‌గ‌న్

కేంద్రంలో చ‌క్రం తిప్పుతున్న వైఎస్ జ‌గ‌న్
x
Highlights

బీజేపీ - వైసీపీ మ‌ధ్య ర‌హ‌స్య ఒప్పందాలు జ‌రుగుతున్నాయ‌నే విష‌యం తెలిసిందే. తాజాగా వైసీపీ ఎంపీలు కేంద్ర రైల్వే మంత్రి పియూష్ గోయ‌ల్ తో భేటీ అవ్వ‌డం...


బీజేపీ - వైసీపీ మ‌ధ్య ర‌హ‌స్య ఒప్పందాలు జ‌రుగుతున్నాయ‌నే విష‌యం తెలిసిందే. తాజాగా వైసీపీ ఎంపీలు కేంద్ర రైల్వే మంత్రి పియూష్ గోయ‌ల్ తో భేటీ అవ్వ‌డం సంచ‌ల‌నంగా మారింది.
బీజేపీ - టీడీపీ తో స్నేహం చేసేందుకు ఇష్ట‌ప‌డ‌డంలేదు. అధికారంలోకి వ‌చ్చిన బీజేపీ ఏం చేసిందో చెప్పాల‌ని టీడీపీ ప్ర‌శ్న‌లు వేయ‌డం,..కేంద్రం నుంచి వ‌చ్చే నిధుల‌తో రాష్ట్రాన్ని అభివృద్ధిని చేస్తూ ఆ క్రెడిట్ ను టీడీపీ త‌న అకౌంట్లో వేసుకోవ‌డంతో బీజేపీ గుర్రుగా ఉంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎలాగైనా టీడీపీ తో గుడ్ బై చెప్పి వైసీపీ తో స్నేహం చేయాల‌ని బీజేపీ భావిస్తున్న‌ట్లు సో్ష‌ల్ మీడియాలో వార్త‌లు హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి.
ఈ నేప‌థ్యంలో కేంద్రంలో కొన్ని కీల‌క ప‌రిణామాలు చోటు చేసుకున్నాయి. దీంతో వైసీపీ - బీజేపీ స్నేహ‌బంధం కాయ‌మ‌నే సంకేతాలు వినిపిస్తున్నాయి.
ఏపీ అసెంబ్లీ స‌మావేశాలు కొన‌సాగుతున్నాయి . ఈ స‌మావేశాల్లో టీడీపీకి చెందిన కొంత‌మంది నేత‌లు వైసీపీ - బీజేపీ బంధం గురించి ఆరోప‌ణులు చేస్తున్నారు. చంద్ర‌బాబు కూడా ప‌లుమార్లు ఇదే అభిపప్రాయాన్ని వ్య‌క్తం చేశారు.
కేంద్రం ఏ నిర్ణ‌యం తీసుకున్నా త‌మ‌కంటే ముందుగా వైసీపీకి ఎలా తెలుస్తున్నాయ‌ని ప్ర‌శ్నించారు. బీజేపీ రాష్ట్రపతి అభ్యర్థి రామ్ నాథ్ కోవింద్ అని వైసీపీ నేత విజయ సాయి రెడ్డికి ముందే తెలిసి, బీహార్ గవర్నర్‌గా ఉన్నప్పుడే వెళ్లి కలిశారన్నారు.
ఇదిలా ఉంటే బీజేపీ - వైసీపీ బంధం గురించి చంద్ర‌బాబు చేస్తున్న ఆరోప‌ణ‌లు నిజ‌మ‌య్యేల పార్లమెంట్ లో ఓ సంఘ‌ట‌న చోటు చేసుకుంది. ఏపీకి రైల్వే జోన్ గురించి మాట్లాడేందుకు టీడీపీ ఎంపీలు కేంద్రం రైల్వే మంత్రి పీయూష్ గోయల్ తో అపాయింట్మెంట్ కోసం ఉద‌యం నుంచి సాయంత్రం వ‌ర‌కు పార్ల‌మెంట్ లో ప‌డిగాపులు కాసారు. కానీ వారికి అపాయింట్మెంట్ ల‌భించ‌లేదు. అయితే వైసీపీ తిరుప‌తి ఎంపీ వ‌ర‌ప్ర‌సాద్ త‌న నియోజ‌క‌వ‌ర్గంలో రైల్వే స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించాలంటూ పియుష్ గోయ‌ల్ కు విన‌తి ప‌త్రాలు స‌మ‌ర్పించిన‌ట్లు తెలుస్తోంది. కాగా, ఉద్దేశపూర్వకంగానే టీడీపీ ఎంపీలకు ఇచ్చిన అపాయింట్‌మెంట్‌ను రద్దు చేసి అదే సమయంలో వైసీపీ ఎంపీకి అపాయింట్‌మెంట్ ఇచ్చారనే అనుమానాన్ని కొందరు వ్యక్తం చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories