logo
సినిమా

‘బిగ్‌బాస్-2’కు ముహూర్తం ఫిక్స్

‘బిగ్‌బాస్-2’కు ముహూర్తం ఫిక్స్
X
Highlights

తెలుగు బుల్లితెర చరిత్రలోనే అత్యంత భారీ షో ‘బిగ్‌ బాస్’. ఇప్పటి వరకు తెలుగులో ఇంత భారీ బడ్జెట్‌ షో రాలేదు....

తెలుగు బుల్లితెర చరిత్రలోనే అత్యంత భారీ షో ‘బిగ్‌ బాస్’. ఇప్పటి వరకు తెలుగులో ఇంత భారీ బడ్జెట్‌ షో రాలేదు. దీనికి తోడు తొలి సీజన్‌కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ వ్యాఖ్యాత కావడంతో మరింత పాపులారిటీ వచ్చింది. బుల్లితెరపై మళ్లీ బిగ్‌బాస్ సందడి మొదలు కానుంది. నాచులర్ స్టార్ నాని వ్యాఖ్యతగా ప్రారంభం కానున్న ‘బిగ్‌బాస్ 2’కు ముహూర్తం ఫిక్స్ అయ్యింది. జూన్ 10 నుంచి ఈ షో ప్రారంభం కానున్నట్లు నాని వెల్లడించారు. వందరోజులు ఈ షో జరగననుండగా, 16మంది సెలబ్రిటీలు ఇందులో పాల్గొననున్నారు. వారు ఎవరన్నది మాత్రం ఇంకా తెలియరాలేదు. అయితే ‘బిగ్‌బాస్’ మొదటి సీజన్‌కు ఎన్టీఆర్ వ్యాఖ్యతగా వ్యవహరించగా 14మంది సెలబ్రిటీలు పాల్గొన్నారు. ఆ తరువాత వైల్డ్‌కార్డ్ ఎంట్రీలో మరో ఇద్దరు సెలబ్రిటీలు వచ్చారు. వారిలో శివ బాలాజీ మొదటి సీజన్‌కు విజేతగా నిలిచిన విషయం తెలిసిందే.

Next Story