logo
సినిమా

బిగ్ బాస్ హౌజ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన హిజ్రా

బిగ్ బాస్ హౌజ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన హిజ్రా
X
Highlights

తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో బిగ్ బాస్ షోకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నెంబర్ వన్...

తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో బిగ్ బాస్ షోకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నెంబర్ వన్ రియాలిటీ షోగా దూసుకుపోతున్న ఈ షోని తెలుగులో నాని వ్యాఖ్యాతగా వ్యవహరిస్తుండగా, తమిళంలో కమల్ హాసన్, మలయాళంలో మోహన్ లాల్ హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. బుల్లితెర ప్రేక్షకులకు బిగ్ బాస్ షో మంచి ఎంటర్టైన్మెంట్. ప్రతి వారం కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అవ్వడం, వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా కొత్త కంటెస్టెంట్స్ హౌస్ లోకి రావడం జరుగుతుంటుంది. తాజాగా మలయాళ బిగ్ బాస్ హౌస్ నుండి నటి శ్వేతామీనన్ ఎలిమినేట్ అయింది. ఇప్పుడు ఆ షోకి వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా హిజ్రా కం నటి అంజలి అమీర్ ఎంట్రీ ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది.

మ‌మ్ముట్టి ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కిన పెరంబు చిత్రంలో క‌థానాయిక‌గా న‌టించింది అంజలి. ఆ త‌ర్వాత ప‌లు చిత్రాల‌లో న‌టించిన ఆమె ఇప్పుడిప్పుడే మంచి పేరు తెచ్చుకుంటుంది. ప్ర‌స్తుతం బిగ్ బాస్ హౌజ్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌డంతో స‌ర్వత్రా ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. మ‌రి అంజ‌లి బిగ్ బాస్ హౌజ్‌లో చేసే సంద‌డి ఎలా ఉంటుంద‌నేది స‌స్పెన్స్. మ‌రే ఇదే స్పూర్తితో త‌మిళం, తెలుగు భాష‌ల‌లోను హిజ్రాల‌ని హౌజ్‌లోకి తీసుకొచ్చే అవ‌కాశం ఉంటుందా అని ప‌లువురు అనుమానాలు వ్య‌క్తం చేస్తున్నారు.

Next Story