logo
సినిమా

ఘోర రోడ్డు ప్రమాదం.. హీరోయిన్ మనీషా మృతి!

ఘోర రోడ్డు ప్రమాదం.. హీరోయిన్ మనీషా మృతి!
X
Highlights

ఉత్త్రప్రదేశ్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బల్లియాలోని చిట్టౌని గ్రామంలో సహనటుడు సంజీవ్‌...

ఉత్త్రప్రదేశ్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బల్లియాలోని చిట్టౌని గ్రామంలో సహనటుడు సంజీవ్‌ మిశ్రాతో కలిసి వెళుతున్న హీరోయిన్ మనీషా మృతిచెందారు. మనీషా భోజపురి భాషలో పలు సినిమాల్లో నటించారు. షూటింగ్ నిమిత్తం స్నేహితుడు, నటుడు సంజీవ్‌ మిశ్రాతో మనీషా వెళుతుండగా మార్గం మధ్యలో వెనకాలే వస్తున్న కారు అదుపుతప్పి బైక్ ను ఢీకొట్టింది. దీంతో వెనకాల కూర్చున్న మనీషా అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. మిశ్రాకు గాయాలు కాగా, ఆయన్ని స్థానికులు ఆస్పత్రిలో చేర్పించారు. ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్‌ పరారీలో ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. కాగా హీరోయిన్ మనీషా మృతిపట్ల పలువురు నటులు సంతాపం తెలియజేశారు.

Next Story