సరైన మోతాదులో నీరు త్రాగడం వలన ఉపయోగాలు

సరైన మోతాదులో నీరు త్రాగడం వలన ఉపయోగాలు
x
Highlights

మనిషికి జీవన ఆధారం నీరు. ఆరోగ్యంగా జీవించడానికి రోజు నీరు త్రాగడం అవసరం. శరీరములో రక్తానికి ఎంత ప్రాధాన్యత ఉందో నీటికి అంతే ప్రాధాన్యత ఉంది. మానవ...

మనిషికి జీవన ఆధారం నీరు. ఆరోగ్యంగా జీవించడానికి రోజు నీరు త్రాగడం అవసరం. శరీరములో రక్తానికి ఎంత ప్రాధాన్యత ఉందో నీటికి అంతే ప్రాధాన్యత ఉంది. మానవ శరీరంలో ద్రవ పదార్ధాల సమ్మేళనానికి, విటమిన్లు, మినరల్స్ అన్ని అవయవాలాను సరఫరా చేయడంలో నీరు ముఖ్య పాత్రపోషిస్తుంది. నీటిలో క్లోరిన్‌, ఆక్సిజన్ వంటి వాయువులు సమపాళ్ళలో ఉంటే మనిషి ఎప్పుడూ ఆరోగ్యంగానే ఉంటాడు. ప్రతిరోజు కనీసం 10-12 గ్లాస్ల నీరు త్రాగడం వలన ఆరోగ్యనికి చాల ప్రయోజనాలు ఉన్నాయి. శరీరం లోపల నీరు ఎక్కువగా ఉన్నట్లయితే చర్మం కాంతివంతంగా ఉంటుంది. రోజు ఉదయాన్నే లేచిన తరువాత 800మిల్లీలీటర్ల నుంచి 1000 మిల్లీలీటర్ల నీరు తాగితే శరీరంలో ఉండే మలిన పదార్ధాలు ఎక్కడున్నా నీటిలో చేరిపోతాయి. దాంతో పొట్టభాగం శుభ్రంగా ఉంటుంది. తద్వారా ఉదర సంబంధిత వ్యాధులు రావడానికి అవకాశం ఉండదు. అలాగే గోరువెచ్నని నీరు త్రాగడం వలన శరీరంలో ఒత్తిడి పెరిగి తొందగరగా మలవిసర్జన జరుగుతుంది. అంతేకాకూండా వేడి నీటి వలన చర్మం మరియు జుట్టు ఆరోగ్యంగా ఉంటాయి. నీరు ఎక్కువగా త్రాగడం వల్ల నాడీవ్యవస్థ లోవున్న కొవ్వు ని బయటకు తొలగించి నాడీ వ్యవస్థను శుభ్రం చేస్తుంది. ప్రతిరోజు సరైన మోతాదులో మంచినీరు తాగడం వలన జీర్ణ ప్రక్రియ సక్రమంగా జరిగి మలబద్దకం దూరమవుతుంది. అయితే భోజన సమయాల్లో నీరు త్రాగడం అంత శ్రేయస్కరం కాదు.. ఆలా చేస్తే గ్యాస్ ప్రాబ్లెమ్ పెరిగే అవకాశముంది. నీరు ఎక్కువగా త్రాగడం వలన శరీరంలోని విషపూరితమైన వ్యర్ధ పదార్థాలు బయటకు పంపడమే కాకుండా చర్మం, ఉదరం, మూత్రపిండాలలోనున్న విషపదార్థాలు బయటకు విసర్జించబడతాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories