ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు కన్నుమూత

ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు కన్నుమూత
x
Highlights

ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు త్రినాంకుర్ నాగ్ (26) దుర్మరణం చెందాడు. పశ్చిమ బెంగాల్ రాష్ట్ర డబుల్స్ నెం.1 ర్యాంకర్ అయిన నాగ్ కరెంట్ షాక్‌తో...

ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు త్రినాంకుర్ నాగ్ (26) దుర్మరణం చెందాడు. పశ్చిమ బెంగాల్ రాష్ట్ర డబుల్స్ నెం.1 ర్యాంకర్ అయిన నాగ్ కరెంట్ షాక్‌తో ప్రాణాలు విడిచాడు. త్రినాంకుర్ రైల్వే ఉద్యోగి. షెడ్లో రైల్వే కార్ షేడ్‌లో పనిచేస్తుండగా కరెంట్ షాక్‌తో మృతిచెందాడు. హై టెన్షన్ కరెంట్ తీగలు తగలడంతో దీంతో హుటా హుటినా బీ ఆర్‌ సింగ్‌ ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందినట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. త్రినాంకుర్ నాగ్ తిరిగిరాని లోకానికి వెళ్లిపోయాడు. తనకు ఉన్న ప్రతిభతో రాష్ట్రానికి ఎన్నో స్వర్ణ పతకాలు సాధించి పెట్టిన నాగ్‌ ఇక లేడన్న విషయం చాలా బాధకరంగా ఉందని, త్రినాంకుర్ మృతి పట్ల పశ్చిమ బెంగాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ సంతాపం వ్యక్తం చేసింది

Show Full Article
Print Article
Next Story
More Stories