ల‌బోదిబోమంటున్న బ్యాంకు ఖాతాదారులు

ల‌బోదిబోమంటున్న బ్యాంకు ఖాతాదారులు
x
Highlights

బ్యాంకు ఖాతాదారులు ల‌బోదిబోమంటున్నారు.కొత్త సంవ‌త్స‌రం సంద‌ర్భంగా ఎస్ బీఐ త‌న క‌ష్ట‌మ‌ర్లకు హోం లోన్ , ఎడ్యుకేష‌న్ లోన్ తీసుకున్న‌వారికి...

బ్యాంకు ఖాతాదారులు ల‌బోదిబోమంటున్నారు.కొత్త సంవ‌త్స‌రం సంద‌ర్భంగా ఎస్ బీఐ త‌న క‌ష్ట‌మ‌ర్లకు హోం లోన్ , ఎడ్యుకేష‌న్ లోన్ తీసుకున్న‌వారికి వ‌డ్డీరేట్లను త‌గ్గిస్తూ శుభ‌వార్త‌నందించింది. కానీ పెనాల్టీల రూపంలో ఎస్ బీ ఐ క‌ష్ట‌మ‌ర్ల నుంచి కోట్ల‌లో వ‌సూలు చేసిన‌ట్లు స‌మాచారం. 2017 ఏప్రీల్ - న‌వంబ‌ర్ ల‌లో వివిధ బ్యాంకులు క‌ష్ట‌మ‌ర్లు త‌మ ఖాతాలో క‌నీస నిల్వ లేద‌న్న సాకుతో రూ.2,320కోట్ల‌ను వ‌సూలు చేశాయి. వాటిలో ఎస్ బీ ఐ త‌న క‌ష్ట‌మ‌ర్ల నుంచి రూ.1,771కోట్ల రూపాయాల్ని ముక్కుపిండి వ‌సూలు చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఎస్‌బిఐ గతేడాది జూలై-సెప్టెంబర్‌ త్రైమాసికంలో సంపాదించిన నికర లాభం 1,581 కోట్ల రూపాయల కంటే, ఇలా పెనాల్టీల పేరుతో ఖాతాదారుల నుంచి వసూలు చేసిన మొత్తమే ఎక్కువ.
ఈ క‌నీస నిల్వ‌ల నిబంధ‌న‌ల్ని గ‌త ఐదు సంవ‌త్స‌రాల నుంచి కేంద్రం,ఆర్బీఐ అండ‌తో బ్యాంకులు తెర‌పైకి తెచ్చాయి.నిబంధ‌న‌ల‌కు అనుగుణంగా క‌నీస నిల్వ‌లు లేక‌పోతే పెనాల్టీలు విధిస్తున్నాయి. వాటిలో బేసిక్‌ సేవింగ్స్‌ ఖాతాలు, ప్రధానమంత్రి జన్‌ధన్‌ యోజన ఖాతాలకు మాత్రం ప్రస్తుతం ఈ చార్జీల నుంచి మినహాయింపు ఉంది.
నిబంధ‌న‌ల పేరుతో ఏబ్యాంకు ఎంత వ‌సూలు చేసిందంటే
పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (పిఎన్‌బి)97.34 కోట్లు, సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా 68.67 కోట్లు, కెనరా బ్యాంకు 62.16 కోట్లను వ‌సూలు చేసిన‌ట్లు తెలుస్తోంది.
ఖాతాలో ఎంత ఉండాలి..
ఎస్‌బిఐ బ్యాంకు నిబంధనల ప్రకారం మెట్రో నగరాల్లోని 3,000, అర్బన్‌ ఏరియాల్లోని బ్యాంకు శాఖల్లో 3,000 రూపాయల కనీస నిల్వ, సెమి అర్బన్‌ ఏరియాల్లో 2,000 రూపాయలు. గ్రామీణ ప్రాంత శాఖల్లో కనీసం 1,000 రూపాయల నిల్వ ఉండాలి. ఈ నిల్వ‌లు లేక‌పోతే పెనాల్టీ రూపంలో వ‌సూలు చేస్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories