Top
logo

అనుమానంతో భార్యను చంపి.. ఆత్మహత్య..

అనుమానంతో భార్యను చంపి.. ఆత్మహత్య..
X
Highlights

అనుమానంతో కట్టుకున్న భార్యను చంపి ఆపై ఆత్మహత్య చేసుకున్నాడు ఓ బ్యాంకు ఉద్యోగి. ఈ ఘటన హైదరాబాద్ లో...

అనుమానంతో కట్టుకున్న భార్యను చంపి ఆపై ఆత్మహత్య చేసుకున్నాడు ఓ బ్యాంకు ఉద్యోగి. ఈ ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది. హైదరాబాద్ కు చెందిన మాధవ్, సుమలత దంపతులు. మాధవ్ సిండికేట్ బ్యాంక్‌లో అసిస్టెంట్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. సుమలతకు మరో వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతో భార్యను కొంతకాలంగా వేధిస్తున్నాడు. ఈ క్రమంలో దంపతులమధ్య తీవ్ర కలతలు వచ్చాయి. భార్య తన మాట వినడం లేదన్న కోపంతో మాధవ్ చివరికి ఆమెను దారుణంగా హతమార్చాడు. అనంతరం తాను కూడా విద్యానగర్‌లోని జమీ ఉస్మానియా రైల్వే స్టేషన్ వద్ద రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఉస్మానియాకు పంపారు.

Next Story