బండ్ల గణేష్ అందుకే ఆ పార్టీలో చేరాడా..?

బండ్ల గణేష్ అందుకే ఆ పార్టీలో చేరాడా..?
x
Highlights

'బండ్ల గణేష్' సినిమా ఇండస్ట్రీలో ఈ పేరంటే పెద్దగా పరిచయం అక్కర్లేదు. బడా హీరోలతో భారీ బడ్జెట్ చిత్రాలను నిర్మించిన నిర్మాత.. సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్...

'బండ్ల గణేష్' సినిమా ఇండస్ట్రీలో ఈ పేరంటే పెద్దగా పరిచయం అక్కర్లేదు. బడా హీరోలతో భారీ బడ్జెట్ చిత్రాలను నిర్మించిన నిర్మాత.. సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ గా పేరు తెచ్చుకున్న గణేష్ సడెన్ గా రాజకీయాల్లోకి ప్రవేశించారు. అది కూడా కాంగ్రెస్ లో చేరడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. పవన్ కళ్యాణ్ కు వీరాభిమానిగా చెప్పుకుంటాడు గణేష్.. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీని ఎవరు విమర్శించినా ఊరుకోరు.. అలాంటిది ఆయన జనసేనలో కాకుండా కాంగ్రెస్ లో చేరడం పవన్ కళ్యాణ్ అభిమానులను విస్మయానికి గురిచేసింది. అయితే బండ్ల గణేష్ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ఓ బలమైన కారణముందని సినీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ప్రస్తుతం ఎలాగో కాంగ్రెస్, టీడీపీలు పొత్తుపెట్టుకుంటున్నాయి. రెండు పార్టీలకు బలమైన నియోజకవర్గంగా పేరొందిన జూబిలీహిల్స్ నుంచి పోటీకి దిగాలని అయన అనుకుంటున్నారట.. ఈ క్రమంలో పొత్తుల్లో భాగంగా ఆ సీటు కాంగ్రెస్ కు కేటాయించే అవకాశముందని ప్రచారం జరుగుతోంది.

ఒకవేళ అలా జరిగితే ఆ సీటును తనకు కేటాయించామని అడగొచ్చనే ఉద్దేశంతోనే గణేష్.. కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. అయితే అది అంత ఈజీ కాకపోవచ్చు.. జూబిలీహిల్స్ నుంచి కాంగ్రెస్ పార్టీ తరుపున మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి ఇంచార్జ్ గా ఉన్నారు. ఈసారి కూడా తనకే టికెట్ వస్తుందన్న ఆశతో విష్ణు ఉన్నారు. పైగా అయన మాజీ మంత్రి పి జనార్దన్ రెడ్డి కుమారుడు కావడం కలిసివచ్చే అవకాశం. అంతేకాకుండా విష్ణు ఇక్కడినుంచే గతంలో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కానీ 2014 లో టీడీపీ అభ్యర్థి మాగంటి గోపినాధ్ చేతిలో పరాజయం పాలయ్యారు. మారిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా గోపినాధ్ తెరాస లో చేరిపోయారు. వచ్చే ఎన్నికల్లో కూడా ఆయననే అభ్యర్థి అని తెరాస అధినాయకత్వం ప్రకటించింది. ఇక గోపినాధ్ ను ఢీకొట్టాలంటే విష్ణు అయితేనే కరెక్ట్ పర్సన్ అని కాంగ్రెస్ లోని కొందరు నాయకులు భావిస్తున్నారు. తాజాగా పార్టీలో చేరిన బండ్ల ఆ సీటును ఆశించడానికే పార్టీలో చేరాడని ప్రచారం జరుగుతోంది. ఇక విపక్షాల ఉమ్మడి అభ్యర్థి. బండ్ల గణేశా లేక విష్ణువర్ధన్ రెడ్డా అన్నది మరికొద్ది రోజుల్లో తేలాల్సి ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories