దత్తన్నా... ఏంటీ అసెంబ్లీ బరిలో ఉన్నారా?

దత్తన్నా... ఏంటీ అసెంబ్లీ బరిలో ఉన్నారా?
x
Highlights

ఆయన కాషాయ పార్టీలో ఉన్నా, అన్ని పార్టీలకూ అందరివాడు. ప్రత్యర్థులు సైతం గౌరవించే మితభాషి. ఇప్పుడు పార్టీ ఒంటరిపోరాటంలో, తనదైన వ్యూహంతో వెళ్లాలని...

ఆయన కాషాయ పార్టీలో ఉన్నా, అన్ని పార్టీలకూ అందరివాడు. ప్రత్యర్థులు సైతం గౌరవించే మితభాషి. ఇప్పుడు పార్టీ ఒంటరిపోరాటంలో, తనదైన వ్యూహంతో వెళ్లాలని ఆలోచిస్తున్నారు. అందుకే పార్లమెంట్‌ కంటే ముందే జరిగే అసెంబ్లీ పోరులో నిలబడాలని ఆలోచిస్తున్నారు. ఇంతకీ అందరివాడైన ఆ కాషాయ నేత ఎవరు...ఎక్కడి నుంచి పోటీ చేయాలని రంగం సిద్దం చేసుకుంటున్నారు. గతానికి భిన్నంగా కేవలం అసెంబ్లీకి మాత్రమే ఎన్నికలు వస్తుండడంతో పార్లమెంటుకు పోటీ చేసిన మాజీ కేంద్రమంత్రులు, రంగంలో దిగుతున్నారు. ఈ ఎన్నికలో బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తుండటంతో, సిట్టింగ్ ఎంపీలు తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ వరుసలో ముందున్నారు కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ.

తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంటు పరిధిలోని అసెంబ్లీకి రంగంలో దిగడానికి విశ్వప్రయత్నం చేస్తున్నారనే చర్చ బీజేపీ లో జోరుగా సాగుతోంది. ఆయన సికింద్రాబాద్ పార్లమెంటు పరిధిలోని సనత్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారని తెలుస్తోంది. అక్కడ బీజేపీ క్యాడర్‌తో పాటు, ఆయన సన్నిహితులు ఎక్కువగా ఉండడంతో, సనత్‌ నగర్ నుంచి తాను పోటీ చేస్తున్నట్లు తన ఫాలోవర్స్ కు దత్తన్న చెబుతున్నారని పార్టీలో చర్చ జరుగుతోంది. అందుకే దత్తన్న సనత్ నగర్ అసెంబ్లీ పరిధిలోని పలు ప్రాంతాల్లో పర్యటించారని చెప్పుకుంటున్నారు.

ఇక దత్తన్న ఇదే సరైన సమయమని భావించి, తనతోపాటు తన వారసులను అసెంబ్లీ ఎన్నికల రంగంలో దించుతున్నారు. ఇన్నిరోజులు దత్తన్న వెనకుండి రాజకీయ వ్యూహం అమలు చేసిన, వరుసకు కొడుకు... మాజీ osd ప్రదీప్, ఈ ఎన్నికలో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి కొలువైన ఆలేరు నియోజకవర్గం నుంచి, పోటీ చేయడానికి సిద్దమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అక్కడ యాదాద్రి పుణ్యక్షేత్రం తో హిందు సెంటిమెంటు వర్కౌట్ అవుతుందని దత్తన్న భావిస్తున్నారు. దీనికి తోడు దత్తన్న సామాజిక వర్గం ఓట్లు మెజార్టీగా ఉండడంతోనే, తన వారసున్ని ఆలేరు నుంచి బరిలోకి నిలుపుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ప్రదీప్ ఆలేరులో పర్యటించారు.

ఇక దత్తన్న వియ్యంకుడు జబర్ధన్ రెడ్డి సైతం, ఎన్నికల బరిలో దిగుతారనే చర్చ సాగుతోంది. ఆయనను ఇప్పటికే చేవెళ్ల పార్లమెంటుకు సహా ఇంచార్జ్ గా పార్టీ నియమించింది. పార్లమెంటుకు పోటీచేసే నేతలంతా అసెంబ్లీకి పోటీచేయాలని అధిష్టానం ఆదేచించడంతో జనార్దన్ రెడ్డి సైతం రాజేంద్రనగర్ అసెంబ్లీ నుంచి రంగంలో దిగే అవకాశం ఉందని చర్చ బీజేపీలో ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories