బాలయ్య ఇదేం హిందీ....అర్థాల కోసం వెతుకున్న మేధావులు

x
Highlights

బావకళ్లల్లో ఆనందం చూడటానికి బాలయ్య రెచ్చిపోయాడు. వచ్చీరాని హిందీలో అడ్డంగా మాట్లాడేశాడు. సినీ డైలాగులు సొంత కవిత్వాన్ని వాడేస్తూ తనదైన శైలిలో...

బావకళ్లల్లో ఆనందం చూడటానికి బాలయ్య రెచ్చిపోయాడు. వచ్చీరాని హిందీలో అడ్డంగా మాట్లాడేశాడు. సినీ డైలాగులు సొంత కవిత్వాన్ని వాడేస్తూ తనదైన శైలిలో ప్రసంగించాడు. ప్రధాని మోడీని ఉద్దేశించి మాట్లాడిన బాలయ్య హిందీ మాటలకు అర్థాలేంటి? హిందీ పండితులకు, ఉర్దూకు ఆలవాలమైన హైదరాబాదీ ముస్లింలు కూడా ఈ విషయంలో తర్జనభర్జన పడుతున్నారు.

శిఖండి, కొజ్జా, న‌మ‌ఖ‌రాం ఇవిన్నీ ఎవరో తిట్టుకున్న తిట్లు కావు. హిందూపురం ఎమ్మెల్యే చంద్రబాబు వియ్యంకుడు, నందమూరి నట సింహం బాలకృష్ణ వాడిన పదజాలం. ధర్మపోరాట దీక్ష సమయంలో చంద్రబాబుకు మద్దతుగా వచ్చిన బాలయ్య దీక్ష ప్రాంగంణం నుంచి హిందీ, తెలుగు క‌ల‌గ‌లిపి హిందీలో దంచిపడేశాడు.

కొన్ని సినీ డైలాగలు, సొంత కవిత్వాలను మిక్స్‌ చేస్తూ త‌న‌దైన శైలీలో మాట్లాడిన బాలయ్య ప్రధాని మోడీని ఉద్దేశించి వ్యక్తిగ‌త దూష‌ణ‌ల‌ు చేయడం చర్చనీయాంశంగా మారింది. ప్రజా క్షేత్రంలో ఉంటూ ప్రజాప్రతినిధిగా ఉండే వ్యక్తికి రాజ‌కీయాలపై అవగాహన అవసరమంటూ ప్రతిపక్షాలు అగ్గి మీద గుగ్గిలమవుతున్నాయి.

బాలకృష్ణ మాట్లాడిన హిందీలో ఆ భాషకు సరైన అర్థం తీసే పనిలో పడ్డారు హిందీ పడింతులు. ఆయన మాట్లాడిన ఏ పదానికి సరైన అర్థం దొరక్కట్లేదని, పుస్తకాలు, మేదళ్లు చదివినా అంతు చిక్కట్లేదని అంటున్నారు. దీనిపై మల్లగుల్లాలు పడుతున్న హిందీ పండితులు ఒకరకమైన మేథోమథనాన్నే చేస్తున్నారని చెప్పుకుంటున్నారు. హిందీ భాషకు, వాటి అర్థాలకు కేంద్రంగా చెప్పుకునే హైదరాబాదీ ముస్లింలను అడిగి మరీ తెలుసుకుంటున్నారు బాలయ్య మాట్లాడిన హిందీ భాషకు అర్థం తెలియట్లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories