logo
సినిమా

బాబాయ్ టైటిల్ అబ్బాయ్‌కి క‌లిసొస్తుందా?

బాబాయ్ టైటిల్ అబ్బాయ్‌కి క‌లిసొస్తుందా?
X
Highlights

'తొలిప్రేమ‌'.. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ కెరీర్‌లో ట‌ర్నింగ్ పాయింట్‌లా నిలిచిన చిత్ర‌మిది. ప్రేమ‌క‌థా...

'తొలిప్రేమ‌'.. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ కెరీర్‌లో ట‌ర్నింగ్ పాయింట్‌లా నిలిచిన చిత్ర‌మిది. ప్రేమ‌క‌థా చిత్రాల‌లో కొత్త ట్రెండ్ సృష్టించిన ఈ సినిమా టైటిల్‌తో మ‌రో చిత్రం తెర‌కెక్కుతోందా? అవున‌నే వినిపిస్తోంది టాలీవుడ్‌లో. 'ఫిదా'తో త‌న కెరీర్‌లో తొలి విజ‌యాన్ని న‌మోదు చేసుకున్న మెగా హీరో వ‌రుణ్‌ తేజ్‌.. త‌న‌ తాజా చిత్రానికి, బాబాయ్ ప‌వ‌న్ న‌టించిన సినిమా టైటిల్‌ని పెట్టే ఆలోచ‌న‌లో ఉన్నాడ‌ట‌. నాటి 'తొలిప్రేమ' చిత్రం ద్వారా క‌రుణాక‌ర‌న్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మైతే.. తాజా 'తొలిప్రేమ' చిత్రం ద్వారా వెంకీ అట్లూరి ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నాడు. 'తొలి ప్రేమ' (1998) రిలీజైన 20 ఏళ్ల త‌రువాత రానున్న ఈ న‌యా 'తొలి ప్రేమ' వ‌రుణ్‌కి ఎలాంటి గుర్తింపుని తీసుకువ‌స్తుందో చూడాలి.

Next Story