ఆయేషా మీరా హత్య కేసులో కొత్తకోణం..

ఆయేషా మీరా హత్య కేసులో కొత్తకోణం..
x
Highlights

సంచలనం సృష్టించిన అయేషా మీరా హత్య కేసులో మరో మలుపు చోటుచేసుకుంది. అయేషా కేసును సీబీఐకి అప్పగిస్తూ హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. కేసును మొదటి నుంచి...

సంచలనం సృష్టించిన అయేషా మీరా హత్య కేసులో మరో మలుపు చోటుచేసుకుంది. అయేషా కేసును సీబీఐకి అప్పగిస్తూ హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. కేసును మొదటి నుంచి విచారణ చేయాలని సీబీఐని హైకోర్టు ఆదేశించింది. అప్పట్లో ఆమె హత్య విషయంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ నాయకుడి కుటుంబంపై ఆరోపణలు వచ్చాయి. కేసును విచారించిన పోలీసులు.. ఫైనల్ గా సత్యంబాబును అదుపులోకి తీసుకున్నారు. అతనే ప్రధాన నిందితుడని ఆరోపించారు. కానీ న్యాయవిచారణలో సత్యంబాబు నిర్దోషిగా బయటపడ్డాడు. దాంతో ఈ కేసులో ప్రధాన నిందితుడే నిర్దోషిగా బయటపడ్డాక.. అసలు దోషి ఎవరనే ప్రశ్న తలెత్తింది. ఈ క్రమంలో సత్యంబాబుపై తాము ఎప్పుడు అనుమానాలు వ్యక్తం చేయలేదని.. పోలీసులే కేసును తప్పుదోవ పట్టించారని అయేషా తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. దీనిపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని బెంచ్ విచారణ చేపట్టింది. దాంతో ఈ కేసును సీబీఐకి అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు అయేషా కేసుకు సంబంధించిన కీలక ఫైళ్లను, పత్రాలను ధ్వంసం చేసిన విజయవాడ కోర్టు సిబ్బందిపై కేసు నమోదు చేయాలని స్పష్టంచేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories