ఎస్సై సహా ముగ్గురు కానిస్టేబుళ్లను చావబాదిన గ్రామస్థులు

ఎస్సై సహా ముగ్గురు కానిస్టేబుళ్లను చావబాదిన గ్రామస్థులు
x
Highlights

నెల్లూరు జిల్లాలో ఓ గ్రామప్రజలు ఎస్సై పై తమ ప్రతాపాన్ని చూపించారు. అకారణంగా ఓ గ్రామస్థుడిని కొట్టారంటూ ఎస్సైని పోలీసుస్టేషన్ లోనే చావబాదారు. ఈ ఘటన...

నెల్లూరు జిల్లాలో ఓ గ్రామప్రజలు ఎస్సై పై తమ ప్రతాపాన్ని చూపించారు. అకారణంగా ఓ గ్రామస్థుడిని కొట్టారంటూ ఎస్సైని పోలీసుస్టేషన్ లోనే చావబాదారు. ఈ ఘటన జిల్లాలోని రాపూరులో జరిగింది. రాపూరుకు చెందిన పిచ్చయ్య, కనకమ్మ, లక్ష్మమ్మ తదితరులు అదే ప్రాంతానికి చెందిన జోసెఫ్‌కు డబ్బులు బాకీ ఉన్నారు. డబ్బులు ఇవ్వకపోవడంతో జోసెఫ్‌ రాపూరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో వారిని విచారించేందుకు పోలీసులు స్టేషన్‌కు తీసుకొచ్చారు పోలీసులు. అప్పటికే మద్యం సేవించిన పిచ్చయ్యను వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తరలిస్తుండగా, వారి బంధువులు పోలీస్‌ స్టేషన్‌కు చేరుకుని రాళ్ళూ రువ్వారు. స్టేషన్ లోపలి చేరుకున్న మరికొందరు అక్కడ కనిపించిన పోలీసులపై మూకుమ్మడిగా దాడి చేశారు. ఈ క్రమంలో ఎస్‌ఐ లక్ష్మణ్‌ను బయటకు లాగి తలపై కొట్టారు. అడ్డువచ్చి న ముగ్గురు కానిస్టేబుళ్లపై సైతం చితకబాదారు. పైగా ఎస్సై లక్ష్మణ్‌రావును తీవ్రంగా దీంతో ఆయన్ను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉంది. గ్రామస్థులు మాత్రం అకారణంగా పిచ్చయ్యపై దాడి చేయడంతోనే ఈ ఘటన జరిగిందని ఆరోపిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories