logo
జాతీయం

వాజ్‌పేయి ఆరోగ్యంపై జేపీ నడ్డా ప్రకటన

వాజ్‌పేయి ఆరోగ్యంపై జేపీ నడ్డా ప్రకటన
X
Highlights

భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి ఆరోగ్యం అత్యంత విషమంగా మారడంతో కేంద్ర మంత్రులు, పలువురు అగ్రనేతలు...

భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి ఆరోగ్యం అత్యంత విషమంగా మారడంతో కేంద్ర మంత్రులు, పలువురు అగ్రనేతలు ఎయిమ్స్ హాస్పిటల్‌కు చేరుకున్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ కూడా తన పుట్టిన రోజు వేడుకలను రద్దు చేసుకున్నారు. బీజేపీ కూడా నేడు జరగబోయే కార్యక్రమాలన్నీ రద్దు చేసుకుంది. ఇదిలావుంటే వాజ్‌పేయి ఆరోగ్య పరిస్థితిపై కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా ప్రకటన చేశారు. వాజ్‌పేయి ఆరోగ్యం అత్యంత విషమంగా ఉందంటూ గురువారం సాయంత్రం మీడియాకు తెలిపారు. అంతకుముందు వాజ్‌పేయిని పరామర్శించిన కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ కూడా వాజ్‌పేయి ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు.

Next Story