Top
logo

బొడ్డుపల్లి శ్రీనివాస్ భార్యకు నల్లగొండ అసెంబ్లీ సీటు?

బొడ్డుపల్లి శ్రీనివాస్ భార్యకు నల్లగొండ అసెంబ్లీ సీటు?
X
Highlights

తెలంగాణ కాంగ్రెస్, సెంటుమెంటు రగిలించడానికి సిద్దమవుతోందా..? నల్గొండలో హత్యకు గురైన బొడ్డుపల్లి శ్రీనివాస్...

తెలంగాణ కాంగ్రెస్, సెంటుమెంటు రగిలించడానికి సిద్దమవుతోందా..? నల్గొండలో హత్యకు గురైన బొడ్డుపల్లి శ్రీనివాస్ కుటుంబానికి టిక్కెట్టు ఇచ్చి.. తాము కార్యకర్తలను ఆదుకుంటామని చెప్పడానికి రెడీ అవుతోందా..? కోమట్ రెడ్డి వెంకట్ రెడ్డి స్థానాన్ని, ఆ కుటుంబాన్ని త్యాగం చేయడానికి యోచిస్తున్నారా..? తాజా పరిణామాలు పరిశీలిస్తే, అవుననే అనిపిస్తోంది.

బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్య ఆధారంగా కాంగ్రెస్ వేగంగా పావులు కదుపుతోంది. హత్య వెనుక అధికార పార్టీ ఉందని తీవ్రంగా విమర్శిస్తున్న హస్తం పార్టీ మరింత వేగంగా అదే సెంటుమెంటును అందిపుచ్చుకోవడానికి సిద్ధమవుతోంది. హత్యకు గురైన బొడ్డుపల్లి శ్రీనివాస్ భార్య, నల్గొండ మున్సిపల్ చైర్ పర్సన్ లక్ష్మికి పార్టీ టిక్కెట్టు ఇచ్చి బాధిత కుటుంబానికి తాము అండగా ఉన్నామనే సానుభూతి ప్రచారం జరిగేలా పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు.

ఇప్పటికే నల్గొండ జిల్లా వ్యాప్తంగా బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్య సంచలనం సృష్టించింది. ఇటీవల సంతాప సభ ద్వారా కాంగ్రెస్ పార్టీ ఒక్కతాటిపైకి వచ్చి.. లక్ష్మీకి అండగా నిలిచారు. అయితే, ప్రస్తుతం పార్టీలో కొత్త చర్చ జరుగుతోంది. మున్సిపల్ చైర్ పర్సన్ లక్ష్మీకి స్థానిక ఎమ్మెల్యే కోమట్ రెడ్డి వెంకట్ రెడ్డి తన టిక్కెట్టును త్యాగం చేయడానికి సిద్దమవుతున్నట్లు ప్రచారం జోరుగా సాగుతోంది. ఆమెను ఎమ్మెల్యే అబ్యర్దిగా బరిలోకి దించితే గెలుపు ఖాయమని పార్టీ భావిస్తోంది.

ఇక కోమట్ రెడ్డి వెంకట్ రెడ్డి పార్లమెంటుకు పోటిచేయాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీ నుంచి గెలిచిన గుత్తా సుఖెంధర్ రెడ్డి టిఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకోవడంతో వెంకట్ రెడ్డి నల్గొండ పార్లమెంటు స్థానం తనకు కేటాయించాలని సూచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ప్రస్తుత ఎంపీ రాజ్ గోపాల్ రెడ్డి మునుగోడు అసెంబ్లీకి పోటి చేసి రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పడానికి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. రాహుల్‌గాంధీ ద్వారా శ్రీనివాస్ కుటుంబ సభ్యులను పరామర్శింపజేసి నల్గొండ మున్సిపల్స్ చైర్‌పర్సన్‌ను నల్గొండ అసెంబ్లీ పార్టీ అభ్యర్ధిగా ప్రకటించేలా కోమటరెడ్డి బ్రదర్స్ వ్యూహారచన చేస్తున్నారు. అయితే, భాదిత మహిళకు టిక్కెటు ఇవ్వడం ద్వారా కార్యకర్త కుటుంబానికి అండగ ఉన్నామనే భరోసా కార్యకర్తలకు ఇవ్వడానికి కోమట్ రెడ్డి బ్రదర్స్ పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది.

Next Story