మేఘా సిగలో మరో నగ

మేఘా సిగలో మరో నగ
x
Highlights

ఆసియాలోనే అతిపెద్ద బిందు సేద్య ప్రాజెక్ట్ ప్రారంబోత్సవం నేడు కర్నాటకలోని భాగల్‌కోట్ జిల్లా రాంతాల్ మరోళాలో ప్రారంభించినున్న కర్నాటక మంత్రులు...

ఆసియాలోనే అతిపెద్ద బిందు సేద్య ప్రాజెక్ట్ ప్రారంబోత్సవం నేడు కర్నాటకలోని భాగల్‌కోట్ జిల్లా రాంతాల్ మరోళాలో ప్రారంభించినున్న కర్నాటక మంత్రులు ప్రతిష్టాత్మక ప్రాజెక్టును చేపట్టి పూర్తి చేసిన మేఘా ఇంజీనిరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రుక్చర్స్ లిమిటెడ్ 12,300 హెక్టార్లకు సాగునీరు అందించనున్న ప్రాజెక్టు ఆరువేల మందికి పైగా రైతులకు లబ్ధి 2150 కిలోమీటర్ల పైప్‌లైన్ నిర్మాణం

హైదరాబాద్, జనవరి 27: మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రుక్చర్స్ లిమిటెడ్ ( ఎం ఈ ఐ ఎల్) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆసియాలోనే అతిపెద్ద బిందు సేద్య ప్రాజెక్ట్ కర్నాటకలోని భాగల్‌కోట్ జిల్లా రాంతాల్ మరోళాలో ఆదివారం నాడు ప్రారంభం కానుంది. కృష్ణా భాగ్య జల నిగమ అమలు చేస్తున్న ఈ ప్రాజెక్టును మేఘా సంస్థ చేపట్టి పూర్తి చేసింది. ప్రాజెక్టును కర్నాటక జల వనరుల శాఖ మంత్రి ఎంబీ పాటిల్ ఆదివారం ప్రారంభించనున్నారు. ఈ ప్రాజెక్టుకు ఇజ్రాయిల్‌కు చెందిన నెటాఫిమ్ సంస్థ సాంకేతిక సహకారాన్ని అందించింది. ఈ ప్రాజెక్టు నిర్వహణ బాధ్యతలను మేఘా సంస్థ ఐదు సంవత్సరాల పాటు చూడనుంది.ఈ బిందు సేద్య ప్రాజెక్టుకు 2150 కిలోమీటర్లు పైప్‌లైన్ వేశారు. భాగల్‌కోట్ జిల్లాలోని రాంతాల్ మరోళా ప్రాంత రైతులు ఇంతకు ముందు సాగునీరు సక్రమంగా అందక తీవ్ర ఇబ్బందులు పాలయ్యేవారు. ఆయకట్టు చివరి రైతుల పరిస్థితి మరింత దారుణంగా ఉండేది. ఆయకట్టు ఆరంభంలో ఉన్న రైతులు ఏదాదికి రెండు పంటలు పండిస్తే చివరన ఉన్న రైతులకు ఒక పంట పండటం కూడా గగనంగా ఉండేది. ఈ పరిస్థితిని చక్కదిద్దాలని కృష్ణా భాగ్య జలనిగమ నిర్ణయించింది.ఆ బాధ్యతను మేఘా సంస్థకు అప్పగించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ర్టంలో పట్టిసీమ ప్రాజెక్టును అతి తక్కువ సమయంలో పూర్తి చేసి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించిన మేఘా సంస్థ ఆసియాలోనే అతి పెద్ద బిందు సేద్య ప్రాజెక్టును నిర్మించేందుకు శ్రీకారం చుట్టింది. ఆలమట్టి ప్రాజెక్టు బ్యాక్ వాటర్‌ను ఈ ప్రాజెక్టు ద్వారా సద్వినిెూగం చేసి గత ఐదు నుంచి పది సంవత్సరాలుగా నీటి లభ్యత సరిగా లేక కరువుతో అల్లాడుతున్న భాగల్‌కోట్ ప్రాంత రైతుల ఇబ్బందులు తీర్చేందుకు సిద్ధమైంది. బిందు సేద్య ప్రాజెక్టుకు అవసరమైన భూమిని అప్పగించేందుకు తొలుత నిరాకరించిన రైతులను మీ సమస్యలు తీరుతాయని ఒప్పించి పనులను మేఘా సంస్థ చేపట్టింది. ప్రాజెక్టును

పూర్తి చేసింది. ఆదివారం ఇది ప్రారంభం కానుంది. ఇప్పటి వరకూ కాల్వ చివరి భూములకు నీళ్లు అందటం లేదని నిత్యం రైతులు ఘర్షణలకు దిగుతుండేవారు. ఇపుడు ఇక ఆ సమస్య తీరనుంది. మేఘా సంస్థ చేపట్టిన ఈ ప్రాజెక్టు ద్వారా ప్రతి రైతు తమ పొలంలో ఏర్పాటు చేసిన సిలెండర్ ద్వారా నీటిని నేరుగా బిందు సేద్యంతో పంటకు అందించుకోవచ్చు. పంటకు వినిెూగించే ఎరువులు, పురుగు మందులను కూడా ఈ సిలెండర్ ద్వారానే వేసుకునే అవకాశం ఉంది. దీని ద్వారా నీటి వృధాను కూడా అరికట్టవచ్చు. కృష్ణా నది బ్యాక్ వాటర్‌లో ఏవైనా వ్యర్ధాలు వస్తే వాటిని శుభ్రం చేసి పంటలకు అందించే నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఈ ప్రాజెక్టులో వినిెూగించారు. బిందు సేద్యం వల్ల తక్కువ ఖర్చు, తక్కువ నీటి వినియోగం, తక్కువ పురుగుమందులు, తక్కువ శ్రమతో ఎక్కువ ఆదాయం రైతులకు
వస్తుందని కర్నాటక జల వనరుల విభాగం అధికారులు చెప్పారు. దేశంలోనే తొలిసారిగా ఇజ్రాయిల్ సాంకేతిక పరిజ్ఞానంతో చేపట్టిన ప్రాజెక్ట్ ఇది. ఆ ఘనత మేఘా ఇంజనీరింగ్ సంస్థకు దక్కుతుంది. సాధారణంగా బిందు సేద్యానికి ఉపెూగించే పైపులకు భిన్నంగా భూమిలోపల నుంచి పైపులను వేశారు. భూమి లోపల నుంచి వేసిన పైపులు కూడా పది నుంచి 15 సంవత్సరాల కంటే ఎక్కువ వినిెూగించే అవకాశం లేదు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు వినిెూగించిన పైపులు ఫైబర్ ఆప్టిక్‌తో తయారు చేశారు. వీటి జీవిత కాలం 50 సంవత్సరాలు. భూమిలోపల నుంచి పైపులు వేయటం వల్ల రైతులకు కూడా ఎలాంటి నష్టం లేదు. ఈ ప్రాజెక్టు కోసం ఫైబర్ ఆప్టిక్ పైపులను మేఘా సంస్థ ప్రత్యేకంగా తయారు చేయించింది. కృష్ణా నది బ్యాక్ వాటర్ లభ్యం కాని పక్షంలో రైతులు తమ పొలాల్లోని బోర్ల ద్వారా కూడా నీటిని బిందు సేద్యానికి వేసిన పైపుల ద్వారా పంటలకు అందించే సౌకర్యం కూడా కల్పించారు. మేఘా సంస్థ ఐదు సంవత్సరాల నిర్వహణ అనంతరం బిందు సేద్య ప్రాజెక్టును రైతులకు అప్పగించనుంది. ఆ తరువాత వారు దాని నిర్వహణ బాధ్యతలను చేపడతారు. ఇందుకు గాను రైతులు ఒకొక్కరు ప్రతి ఏటా ఎకరాకు సుమారు 1300 రూపాయలు వసూలు చేసుకుని బ్యాంకులో భద్ర పరుచుకుంటారు. ఐదు సంవత్సరాల తరువాత ఏదైనా అవసరమైన పక్షంలో ఆ మొత్తం నుంచి వినియోగించుకుంటారు.

Show Full Article
Print Article
Next Story
More Stories