logo

అసద్ ఇంట నిఖాసందడి..

అసద్ ఇంట నిఖాసందడి..

ఈ నెల 28న హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసి ద్ద కుమార్తె ఖుద్సియా ఒవైసీ నిఖా జరగనుంది. ప్రముఖ పారిశ్రామిక వేత్త, విద్యాసంస్థల అధినేత నవాబ్‌ అహ్మద్‌ ఆలం ఖాన్‌ కుమారుడు నవాబ్‌ బర్కత్‌ ఆలం ఖాన్‌ తో ఖుద్సియా వివాహం జరగనుంది. ఇప్పటికే అసద్ ఇంట పెళ్లి సందడి మొదలయింది. పెళ్ళికి రావలసిందిగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు వివాహ ఆహ్వాన పత్రిక అందించారు. ఆయన తోపాటు పలువురు ప్రముఖులకు నిఖా పత్రికలు అందించారు అసద్ కుటుంబసభ్యులు. పెళ్లి ఏర్పాట్లను ఒవైసీ సోదరులే దగ్గరుండి పర్యవేక్షిస్తున్నట్లు సమాచారం. ఇదే క్రమంలో అసదుద్దీన్‌ రెండో కూతురి పెళ్లి కూడా కుదిరినట్లు సమాచారం. సియాసత్‌ ఉర్దూ దినపత్రిక ఎడిటర్‌ జాహెద్‌ అలీ ఖాన్‌ బంధువు అయిన డాక్టర్‌ మజర్‌ అలీఖాన్‌ కుమారుడితో ఆమె పెళ్లి నిశ్చయమైనట్టు తెలుస్తోంది. ఈ పెళ్లి కూడా జనవరి లేదా మార్చిలో నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

nanireddy

nanireddy

Our Contributor help bring you the latest article around you


లైవ్ టీవి

Share it
Top