logo
సినిమా

రెండో స్థానంలో 'అరవింద సమేత వీర రాఘవ'

రెండో స్థానంలో అరవింద సమేత వీర రాఘవ
X
Highlights

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన అరవింద సమేత వీర రాఘవ సినిమా బాక్సాఫీసు వద్ద ఆరోజు ఈరోజు అన్న తేడా లేకుండా...

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన అరవింద సమేత వీర రాఘవ సినిమా బాక్సాఫీసు వద్ద ఆరోజు ఈరోజు అన్న తేడా లేకుండా దూసుకుపోతోంది. దసరా సెలవులు కావడం, పైగా కొత్త సినిమాలు ఏవి లేకపోవడంతో ఈ సినిమాకు కలెక్షన్స్ మరింత ఊపందుకున్నాయి. ఇప్పటికే అరవింద సమేత.. రికార్డులన్నింటినీ చెరిపేస్తూ వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. సినిమా తొలివారం ముగిసే సరికి ప్రపంచ వ్యాప్తంగా వంద కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఇప్పటికే ఈ చిత్రం యూఎస్ లో 2 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. ఈ సినిమా విడుదలైన ఐదు రోజుల్లోనే 120 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్టు ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. ఇదే నిజమైతే మొదటి స్థానంలో ఉన్న బాహుబలి తరువాత అతి తక్కువ రోజుల్లో వందకోట్ల క్లబ్ లో చేరిన సినిమా అరవింద సమేతనే అవుతుంది. ఎన్టీఆర్ నటన, త్రివిక్రమ్ డైరెక్షన్.. అన్నింటికీ మించి సినిమాకు వచ్చిన పాజిటివ్ రెస్పాన్స్ కారణంగా సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయిందని ట్రేడ్ పండితులు అంటున్నారు.

Next Story