logo
సినిమా

‘అరవింద సమేత’ ప్రీమియర్‌ షో కలెక్షన్లు అదుర్స్‌

‘అరవింద సమేత’ ప్రీమియర్‌ షో కలెక్షన్లు అదుర్స్‌
X
Highlights

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాజా చిత్రం ‘అరవింద సమేత వీర రాఘవ’ బాక్సాఫీసు వద్ద రికార్డు కలెక్షన్లు రాబడుతోంది. మాటల...

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాజా చిత్రం ‘అరవింద సమేత వీర రాఘవ’ బాక్సాఫీసు వద్ద రికార్డు కలెక్షన్లు రాబడుతోంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించిన ఈ భారీ యాక్షన్ చిత్రం తొలి రోజు నుంచే పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. మొదటి షోతోనే పాజిటివ్‌ టాక్‌తో దూసుకెళ్లిన ఈ చిత్రం వసూళ్లలో రికార్డులు క్రియేట్‌ చేస్తోంది. ఓవర్సీస్‌లో ఒక్కరోజులోనే మిలియన్‌ డాలర్ల మార్క్‌ను చేరుకుంది. ఈ హవా చూస్తుంటే మూడు మిలియన్ల మార్క్‌ను కూడా అవలీలగా క్రాస్‌ చేసేలా కనిపిస్తోంది. ఈ సినిమా వసూళ్లలో ఎన్ని రికార్డులు బద్దలు కొడుతుందో.. వేచి చూడాలి. జగపతి బాబు, నాగ బాబు, పూజా హెగ్డే, సునీల్‌ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి థమన్‌ సంగీతమందిచారు.

Next Story