ఓం స‌ర్వే నమ: పొలిటిక‌ల్ లీడ‌రేన మ‌హ

ఓం స‌ర్వే నమ: పొలిటిక‌ల్ లీడ‌రేన మ‌హ
x
Highlights

ఏపీ లో పాలిటిక్స్ కొత్త పుంత‌లు తొక్కుతున్నాయి. 2019 ఎన్నిక‌ల నేప‌థ్యంలో ఆయా పార్టీలకు చెందిన నేత‌లు జాత‌కాల‌కు బ‌దులు స‌ర్వేల్ని న‌మ్ముకుంటున్నారు....

ఏపీ లో పాలిటిక్స్ కొత్త పుంత‌లు తొక్కుతున్నాయి. 2019 ఎన్నిక‌ల నేప‌థ్యంలో ఆయా పార్టీలకు చెందిన నేత‌లు జాత‌కాల‌కు బ‌దులు స‌ర్వేల్ని న‌మ్ముకుంటున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఏ పార్టీ గెలుస్తుంది. ఏ పార్టీ ఓడిపోతుంది. ఒక‌వేళ ఎమ్మెల్యేగా, ఎంపీగా గెలిస్తే భ‌విష్య‌త్తు ఎలా ఉండ‌బోతుంద‌నే విష‌యాల‌పై స‌ద‌రు సర్వే నిర్వ‌హించే సంస్థ‌ల‌తో మంత‌నాలు జ‌రుపుతున్న‌ట్లు టాక్
సాధార‌ణంగా ఈ స‌ర్వేల గురించి చెప్పుకోవాలంటే , కేంద్రం , సీఎం చంద్ర‌బాబు గురించే చెప్పుకోవాలి. ఎందుకంటే ఆయా జిల్లాల నాయ‌కుల ప‌నితీరు ఎలా ఉందో తెలుసుకునేందుకు స‌ర్వే నిర్వ‌హిస్తారు. ఈ స‌ర్వే ఆధారంగా నాయ‌కుల‌కు త‌గిన గుర్తింపు ఇస్తారు. అంతే కాదు చంద్ర‌బాబు చేయించిన స‌ర్వే బాగుందంటూ స్థానిక నేత‌ల‌కూడా ఆ స‌ర్వేనే ఫాలో అవుతుంటారు.
కేంద్రం కూడా త‌న ప‌నితీరుపై ప్ర‌జ‌లు ఎలాంటి అభిప్రాయాన్ని వ్య‌క్తం చేస్తున్నార‌నే విషయాన్ని తెలుసుకోవాలంటే ఇంటిలిజెంట్స్ తో స‌ర్వే చేయిస్తుంది. స‌ర్వే అనుగుణంగా ప‌నితీరును మెరుగుప‌ర్చుకుంటుంది.
మాజీ కాంగ్రెస్ ఎంపీ ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్ కూడా త‌న స‌ర్వేతో ఏపీ రాజ‌కీయాల్ని, అక్క‌డి నేత‌ల్ని శాసిస్తున్నారు. లగడపాటి స‌ర్వే ఎలా ఉంటుందో మ‌నంద‌రికి తెలిసిందే. సర్వే చేసి రిజల్ట్స్ ఇస్తే మాత్రం తప్పకుండా అది సక్సెస్ అవుతుందని అంటుంటారు..సక్సెస్ అయిన సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి.
ప్ర‌స్తుతం ఏపీకి చెందిన రాజ‌కీయ‌నేత‌లు ఎవ‌రికి వారు స‌ర్వే చేయించుకుంటున్న‌ట్లు స‌మాచారం. అంతేకాదా ప‌నిలోప‌నిగా స‌ర్వేపై రాజ‌గోపాల్ ను సంప్ర‌దిస్తున్నార‌ట‌. వీరిలో ప్ర‌స్తుత ఏపీ టీడీపీకి చెందిన ఓ మంత్రి స‌ర్వే చేయించుకుంటున్నార‌ని .ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి దూరిపోయే సదరు మంత్రి ఇప్పుడు నా భవిష్యత్తు ఎలా ఉండబోతోంది అంటూ జాతకాన్ని బదులు సర్వేలని నమ్ముకున్నారట.
ఆ స‌ర్వే వ‌స్తే మాత్రం స‌ద‌రు మంత్రి రాజ‌కీయ భ‌విష్య‌త్తు పై నిర్ణ‌యం తీసుకుంటార‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు చెబుతున్నారు. ఆ మంత్రి ఎవ‌రు. పార్టీలో ఉంటారా లేదా జంప్ చేస్తారా అనే విష‌యాలు తెలియాల్సి ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories