హెచ్‌సీయూ వీసీ అప్పారావు హత్యకు కుట్ర

హెచ్‌సీయూ వీసీ అప్పారావు హత్యకు కుట్ర
x
Highlights

హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్శిటీ వీసీ అప్పారావు హత్య కుట్రను తూర్పుగోదావరి జిల్లా పోలీసులు భగ్నంచేశారు. హెచ్‌సీయూ వీసీ అప్పారావు హత్యకు విద్యార్ధులు...

హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్శిటీ వీసీ అప్పారావు హత్య కుట్రను తూర్పుగోదావరి జిల్లా పోలీసులు భగ్నంచేశారు. హెచ్‌సీయూ వీసీ అప్పారావు హత్యకు విద్యార్ధులు వ్యూహరచనచేశారు. రోహిత్‌ వేముల ఆత్మహత్యకు ప్రతీకారంగా హెచ్‌సీయూ విద్యార్ధులు చందన్‌ మిశ్రా, పృథ్వీరాజ్‌‌లు వీసీ మర్డర్‌‌కు కుట్ర చేసినట్లు తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ విశాల్‌ గున్నీ వెల్లడించారు. నిందితులిద్దరినీ మీడియా ముందు ప్రవేశపెట్టిన పోలీసులు భద్రాచలం చర్ల దగ్గర పట్టుకున్నట్లు తెలిపారు. పట్టుబడిన ఇద్దరూ చంద్రన్న దళ సభ్యులంటున్న పోలీసులు మావోయిస్ట్‌ నేత హరిభూషణ్‌ ఆదేశాలతోనే హత్యకు పథక రచన చేశారని వెల్లడించారు. విరసం, చైతన్య మహిళా సంఘం, తెలంగాణ విద్యార్ధి వేదిక సహకారంతోనే ఈ కుట్ర అంతా జరిగిందని తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ విశాల్‌ గున్నీ వెల్లడించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories