ఆ నేత‌ల‌కే వచ్చే ఎన్నిక‌ల్లో టికెట్లు ఖాయం

ఆ నేత‌ల‌కే వచ్చే ఎన్నిక‌ల్లో టికెట్లు ఖాయం
x
Highlights

ఏపీ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఆ పార్టీ నేత‌ల‌కు ఝ‌ల‌క్ ఇచ్చారు. ప‌నితీరు బాగాలేని ప్ర‌జాప్ర‌తినిధుల‌కు వ‌చ్చే ఎన్నిక‌ల్లోటికెట్లు ఇచ్చేది...

ఏపీ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఆ పార్టీ నేత‌ల‌కు ఝ‌ల‌క్ ఇచ్చారు. ప‌నితీరు బాగాలేని ప్ర‌జాప్ర‌తినిధుల‌కు వ‌చ్చే ఎన్నిక‌ల్లోటికెట్లు ఇచ్చేది లేదంటూ బాంబుపేల్చారు. ఈ సంద‌ర్భంగా వైసీపీ ఎంపీ విజ‌య్ సాయిరెడ్డికి స‌వాల్ విసిరారు. విజ‌య‌సాయిరెడ్డి చేసిన ఆరోప‌ణ‌లుకు ఆధారాలున్నాయా అని ప్ర‌శ్నించారు. వైసీపీ ఎంపీ గురించి తాము చేసిన ఆరోప‌ణ‌ల‌పై ఆధారాలు ఉన్నాయంటూ సూచించారు. . కొన్ని రోజులుగా ఏపీ రాష్ట్రంలో టిడిపి, వైసీపీ నేతల మధ్య మాటల యుద్దం సాగుతోంది. కొన్ని సమయాల్లో ఇరు పార్టీలకు చెందిన నేతలు కొన్ని సందర్భాల్లో వ్యక్తిగత విమర్శలకు కూడ దిగుతున్నారు. వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి పీఎంఓ కార్యాలయం చుట్టూ తిరగడాన్ని టీడీపీ నేతలు తప్పుబడుతున్నారు. ఈ విషయమై రెండు పార్టీల నేతల మధ్య మాటల యుద్దం సాగుతోంది. ఏ2 ముద్దాయిగా ఉన్న విజ‌య సాయికి పీఎంవోలోకి తరచూ ఎలా ప్రవేశం లభిస్తోంది? అని అనుమానం వ్య‌క్తం చేశారు.
ఏపీకి ప్ర‌త్యేక‌హోదా కావాలంటూ త‌మ పార్టీ ఎంపీలు మాట్లాడుతుంటే వైసీపీ నేత‌లు కేంద్రానికి అనుకూలంగా మాట్లాడుతున్నార‌ని ఆరోపించారు. కేంద్ర‌బ‌డ్జెట్ పై హ‌ర్షం వ్య‌క్తం చేసిన విజ‌య‌సాయి రాష్ట్ర‌ప్ర‌యోజ‌నాల్ని విస్మ‌రించి మోదీ సభకు వస్తే నిలదీయకుండా పరారవుతున్నారని, లేకపోతే కాళ్లమీద పడుతున్నారని ఎద్దేవా చేశారు.
ఏపీ రాష్ట్ర హక్కుల కోసం ఎంపీలు పోరాటం చేస్తున్నారని ఏపీ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి లోకేష్ చెప్పారు. ఎంపీలు రాజీనామాలు చేస్తే ఏపీ రాష్ట్ర హక్కుల విషయమై ఎవరు పోరాటం చేస్తారని ఆయన ప్రశ్నించారు. వైసీపీ, బీజేపీ నేతల ఆరోపణల్లో సారూప్యత ఉందన్నారు.ఈ రెండు పార్టీలు లోపాయికారీగా ఒప్పందం చేసుకొన్నట్టుగా ఉన్నట్టు కన్పిస్తోందన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories