పెళ్లికుమార్తెగా మంత్రి అఖిలప్రియ

పెళ్లికుమార్తెగా మంత్రి అఖిలప్రియ
x
Highlights

ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖా మంత్రి భూమా అఖిలప్రియ పెళ్లి కూతురయ్యారు.ఈనెల 29 న వేద మంత్రాల సాక్షిగా.. పెద్దల సమక్షంలో ఆమె తన స్నేహితుడు మద్దూరి భార్గవ్...

ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖా మంత్రి భూమా అఖిలప్రియ పెళ్లి కూతురయ్యారు.ఈనెల 29 న వేద మంత్రాల సాక్షిగా.. పెద్దల సమక్షంలో ఆమె తన స్నేహితుడు మద్దూరి భార్గవ్ ను వివాహమాడనున్నారు. అందుకోసం అఖిలను కుటుంబసభ్యులు పెళ్లి కుమార్తెను చేశారు. కాగా ఈ వివాహానికి సీఎం చంద్రబాబు సహా మంత్రులు, ఎమ్మెల్యేలు, అలాగే పలువురు సినీనటులు హాజరుకానున్నారు. పెళ్లి ఏర్పాట్లను మంత్రి అఖిల మేనమామ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి, సోదరులు.. ఎమ్మెల్యే భూమా బ్రహ్మానంద రెడ్డి, జగత్ విఖ్యాత్ రెడ్డి దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. చాల కాలం తరువాత భూమా ఇంట శుభకార్యం జరుగుతుండటంతో కుటుంబసభ్యులు సంతోషంలో ఉన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories