ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు బీజం

x
Highlights

రాయసీమవాసుల చిరకాల వాంచ నెరవేరబోతోంది. ఎన్నోఏళ్లుగా ఊరిస్తున్న ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు బీజం పడబోతుంది. కడప జిల్లాలో గురువారం సీఎం చంద్రబాబు నాయుడు...

రాయసీమవాసుల చిరకాల వాంచ నెరవేరబోతోంది. ఎన్నోఏళ్లుగా ఊరిస్తున్న ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు బీజం పడబోతుంది. కడప జిల్లాలో గురువారం సీఎం చంద్రబాబు నాయుడు ఉక్కు పరిశ్రమకు శంకుస్థాపన చేయనున్నారు. ఉక్కు పరిశ్రమకు శంకుస్థాపనకు జరుగుతుండటంతో సీమవాసుల్లో హర్షం వ్యక్తం అవుతోంది. సిఎం చంద్రబాబు కడప జిల్లా పర్యటన ఖరారు కావడంతో అధికారులు ఏర్పాట్లు చురుగ్గా సాగిస్తున్నారు. గురువారం సిఎం మైలవరం మండలం కంబాలదిన్నె గ్రామ శివార్లలో ఉక్కు పరిశ్రమకు శంకుస్ధానప చేయనున్నారు. ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేసి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామన్న సంకేతాన్ని ప్రజలకు ఇవ్వనున్నారు.

హెలిపాడ్, సభా ప్రాంగణం, పైలాన్ పనులు చురుగ్గా సాగుతున్నాయి. 35 వేల మంది సభకు హాజరయ్యే అవకాశాలున్నాయి. సభా ప్రాంగణంలో ప్రజలు వీక్షించే విధంగా ఎల్సీడి స్ర్కీన్లు, ప్లడ్ లైట్లను ఏర్పాటు చేశారు. సిఎం బాబు మూడు గంటల పాటు అక్కడే ఉండే అవకాశం ఉండటంతో ఆయనకు ప్రత్యేకమైన గదిని సిద్ధం చేస్తున్నారు. కడప జిల్లాలో సీఎం పర్యటన ఏర్పాట్లను మంత్రి ఆదినారాయణ రెడ్డి, సీఎం రమేశ్ , విప్ రామచంద్రయ్య పరిశీలించారు. ఉక్కు పరిశ్రమ ఏర్పాటుపై కేంద్రం మాట తప్పినా రాష్ట్ర ప్రభుత్వం మాట నిలబెట్టుకుంటుందని మంత్రి ఆదినారాయణ అన్నారు. ఉక్కు పరిశ్రమ ఏర్పాటులో ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షలాది సీమవాసులకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు. ఉక్కు పరిశ్రమ ఏర్పాటుతో రాయలసీమకు మహర్దశ పట్టనుందన్నారు టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసుల రెడ్డి. ఖనిజాన్ని దోచుకున్న వ్యక్తికి బ్రహ్మణి ఉక్కు కర్మాగారం కేటాయించారని మండిపడ్డారు. ఉక్కు పరిశ్రమ శంకుస్థాపన కానుండటంతో జిల్లా, సీమ వాసుల్లో ఆనందోత్సహలు వ్యక్తమవుతున్నాయి. ఉక్కు పరిశ్రమ ఏర్పాటు విషయంలో కేంద్ర ప్రభుత్వం మాట తప్పినా రాష్ట్ర ప్రభుత్వం మాట నిలబెట్టుకునే ప్రయత్నాలు సాగిస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories