కుమారస్వామి, దేవెగౌడతో ముగిసిన చంద్రబాబు భేటి...
మోదీ ప్రభుత్వంపై తీవ్రంగా పోరాడుతున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు...
మోదీ ప్రభుత్వంపై తీవ్రంగా పోరాడుతున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు గురువారం జేడీఎస్ అధినేత, మాజీ ప్రధాన మంత్రి దేవె గౌడ, కర్ణాటక ముఖ్యమంత్రి, జేడీఎస్ నేత కుమారస్వామిలతో చర్చలు జరిపారు.
దేవె గౌడ మాట్లాడుతూ నాలుగేళ్ళ ఎన్డీయే పాలన పెద్ద నోట్ల రద్దు వంటి చాలా సమస్యలను సృష్టించిందన్నారు. మోదీ ప్రభుత్వం వ్యవస్థలపై గురిపెట్టిందన్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ సహా లౌకికవాద పార్టీల నేతలను కలిశారన్నారు. ఈ నేపథ్యంలో తమపై ఓ బాధ్యత ఉందన్నారు. లౌకికవాద పార్టీలన్నీ ఏకతాటిపైకి రావలసిన అవసరం ఉందని తెలిపారు.
చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ దేవె గౌడ ఆశీర్వాదాలు, మద్దతు కోసం తాను ఇక్కడికి వచ్చానన్నారు. ఆయన ప్రధాన మంత్రిగా దేశానికి సేవలందించారన్నారు. తనకు ఆయన ఎంతో గౌరవం ఇచ్చారని, తాను దానిని మర్చిపోలేనని తెలిపారు. దేశాన్ని కాపాడటానికి కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి ముందుకు వచ్చారన్నారు. రెగ్యులేటరీ బాడీ అయిన ఆర్బీఐ ప్రస్తుతం మోదీ ప్రభుత్వ ఒత్తిడిలో ఉందన్నారు. ఈడీ, ఆదాయపు పన్ను శాఖలను దుర్వినియోగం చేస్తున్నారని, ఈ వ్యవస్థలను ఉపయోగిస్తూ గుజరాత్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లలో వేధింపులకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. పెట్రోలు, డీజిల్ ధరలు రోజు రోజుకూ పెరుగుతున్నాయని, ఆర్థిక వ్యవస్థ గాడి తప్పిందని అన్నారు. రూపాయి విలువ డాలర్‌తో పోల్చినపుడు దారుణంగా పడిపోయిందన్నారు. వ్యవసాయం సంక్షోభంలో పడిందని, మైనారిటీలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.
ప్రజాస్వామ్యాన్ని, వ్యవస్థలను, దేశాన్ని కాపాడాలన్న లక్ష్యంతో బెంగళూరు వచ్చానని చంద్రబాబు తెలిపారు. దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడటం గురించి కుమారస్వామి, దేవె గౌడలతో చర్చించినట్లు తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని తప్పకుండా కాపాడవలసి ఉందన్నారు. తన లక్ష్యం రాజకీయాలు కాదని స్పష్టం చేశారు. ఢిల్లీలో మీడియా తమ కార్యకలాపాలను ప్రసారం చేయడం లేదని ఆరోపించారు. ఇప్పుడిప్పుడే మీడియా ముందుకు వస్తోందని తెలిపారు.ప్రధాన మంత్రి అభ్యర్థి గురించి తప్పకుండా చర్చిస్తామని తెలిపారు. కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అని తెలిపారు. దేవె గౌడ ప్రధాన మంత్రిగా పని చేసిన కాలంలో ఒక ప్రయోగం జరిగిందని తెలిపారు.
సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ సహా అందరినీ ఏకతాటిపైకి తీసుకొస్తామని చెప్పారు. ప్రస్తుతం ప్రారంభ ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు.మోదీ ప్రభుత్వం తమకు నమ్మక ద్రోహం చేసిందని చంద్రబాబు ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి, ఇవ్వలేదన్నారు. ఈ విషయాలన్నిటినీ అర్థం చేసుకోవాలని కోరారు. కర్ణాటకలో ఉప ఎన్నికల ఫలితాలు దేశ ప్రజల మనోభావాలను ప్రతిబింబిస్తున్నాయని వివరించారు.కుమార స్వామి మాట్లాడుతూ లౌకికవాద శక్తులను ఏకం చేయడం కోసం తాము చర్చలు జరిపినట్లు తెలిపారు. చంద్రబాబు, దేవె గౌడ రాజకీయ లెక్కలు చాలా బాగున్నాయన్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో కూడా 1996నాటి పరిస్థితులు వస్తాయని ఆశిస్తున్నట్లు తెలిపారు.
భవిష్యత్తులో సెక్కులర్ శక్తులన్నీ ఏకమవుతాయని మాజీ ప్రధాని దేవెగౌడ అన్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కర్ణాటక సీఎం కుమారస్వామి, దేవెగౌడతో జరిపిన చర్చలు ముగిశాయి. ఈ సందర్భంగా దేవెగౌడ మీడియాతో మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వాన్ని గద్దె దింపేందుకు ..చంద్రబాబు అన్ని పార్టీలను ఏకం చేస్తున్నారని అన్నారు. రాజ్యాంగ సంస్థలను బీజేపీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని తీవ్రస్థాయిలో విమర్శించారు. బీజేపీ వ్యతిరేక శక్తులన్నీ ఏకం కావాల్సిన సమయం వచ్చిందని ఆయన అన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా లౌకికపార్టీలు ఏకతాటిపైకి రావాలని దేవెగౌడ పిలుపు ఇచ్చారు. ఎన్డీయే ప్రభుత్వం ఎన్నో సమస్యలు సృష్టించిందని విమర్శించారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీయేను ఓడించే ప్రయత్నం చేస్తామని ఆయన అన్నారు.
Jayasudha: బీజేపీలోకి సినీనటి జయసుధ...?
9 Aug 2022 8:03 AM GMTటీఆర్ఎస్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌పై కేసు నమోదు
9 Aug 2022 7:50 AM GMTTelangana News: వీఆర్వోల సర్దుబాటు ప్రక్రియపై హైకోర్టు స్టే
8 Aug 2022 9:38 AM GMTBreaking News: కామన్వెల్త్ గేమ్స్‌లో పీవీ సింధుకు స్వర్ణం
8 Aug 2022 9:28 AM GMTతిరుపతి లడ్డూ ప్రసాదానికి 307 ఏళ్లు
8 Aug 2022 5:03 AM GMTఎంపీ గోరంట్ల న్యూడ్ వీడియోపై స్పందించిన మంత్రి రోజా
7 Aug 2022 12:02 PM GMT
Rashmika Mandanna: కష్టానికి అదృష్టం తోడైంది...
9 Aug 2022 10:39 AM GMTగోరంట్ల మాధవ్ విషయంలో అతిగా స్పందించొద్దు.. వంగలపూడి అనితకు బెదిరింపు...
9 Aug 2022 10:22 AM GMTTelangana News: కన్నుల పండువగా.. ఇంటింటికి జాతీయ జెండాల పంపిణీ
9 Aug 2022 10:13 AM GMTBigg Boss 6 Telugu: అప్పగింతల కాన్సెప్ట్‌తో 'బిగ్‌బాస్' ప్రోమో.....
9 Aug 2022 10:00 AM GMTCash Deposit: ఈ 2 పత్రాలు లేకుండా మనీ డిపాజిట్ కష్టమే.. ఎందుకంటే..?
9 Aug 2022 9:15 AM GMT