ప్రధాని మోడీకి సీఎం చంద్రబాబు లేఖ

ప్రధాని మోడీకి సీఎం చంద్రబాబు లేఖ
x
Highlights

శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో టిట్లీ తుఫానుతో నెలకొన్న నష్టంపై ప్రధాని మోడీకి సీఎం చంద్రబాబు లేఖ రాశారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో తుఫాన్‌తో...

శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో టిట్లీ తుఫానుతో నెలకొన్న నష్టంపై ప్రధాని మోడీకి సీఎం చంద్రబాబు లేఖ రాశారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో తుఫాన్‌తో తీవ్ర నష్టం జరిగిందని, రెండు జిల్లాల్లో 2 వేల 800 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు లేఖలో పేర్కొన్నారు. తక్షణమే 12వందల కోట్లు ఇవ్వాలని లేఖలో సీఎం కోరారు. టిట్లీ తుఫాన్‌ ఉధృతికి ఇళ్లు, రహదారులు దెబ్బతిన్నాయని, హార్టీకల్చర్‌కు వెయ్యి కోట్ల నష్టం చేకూరిందని, అలాగే ఇతర పంటలు 8వందల కోట్ల నష్టం వాటిల్లినట్లు తెలిపారు. అలాగే, విద్యుత్‌ వ్యవస్థ నష్టం 500కోట్లు, రోడ్లు భవనాలు దెబ్బతిని వంద కోట్లు, పంచాయతీరాజ్‌కు 100 కోట్లు, ఫిషరీస్‌- 50 కోట్లు, రూరల్‌ వాటర్‌ సప్లయ్ 100కోట్లు, ఇరిగేషన్‌కు 100 కోట్ల నష్టం వాటిల్లినట్లు లేఖలో ప్రధాని మోడీకి రాసిని లేఖలో చంద్రబాబు తెలిపారు.

టిట్లీ తుఫాను నష్టంపై పలాస మున్సిపల్‌ కార్యాలయంలో సీఎం సమీక్ష నిర్వహించారు. బాధితులను అన్ని విధాలుగా ఆదుకోవాలని అధికారులను ఆదేశించారు. యుద్ధప్రాతిపదికన పునరుద్ధరణ పనులు చేపట్టాలని అధికారులకు చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. సీఎం ఆదేశాలతో 11 మండలాల్లో 2.50 లక్షల కుటుంబాలకు 6 రకాల సరుకులను అధికారులు పంపిణీ చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories