తన సక్సెస్ సీక్రెట్ చెప్పేసిన చంద్రబాబు

తన సక్సెస్ సీక్రెట్ చెప్పేసిన చంద్రబాబు
x
Highlights

‘‘ప్రతికూలతల నుంచి అవకాశాలను వెతుక్కోవాలి’’ విభజిత రాష్ర్టం ఆంధ్రప్రదేశ్ కష్టాల గురించి చర్చకొచ్చిన ప్రతిసారీ ఏపీ సీఎం చంద్రబాబు చెప్పే మాట ఇది. ఆయన...

‘‘ప్రతికూలతల నుంచి అవకాశాలను వెతుక్కోవాలి’’ విభజిత రాష్ర్టం ఆంధ్రప్రదేశ్ కష్టాల గురించి చర్చకొచ్చిన ప్రతిసారీ ఏపీ సీఎం చంద్రబాబు చెప్పే మాట ఇది. ఆయన రాజకీయ జీవితాన్ని గమనిస్తే తన రాజకీయ జీవితంలోనూ అదే సూత్రం పాటించినట్లు అర్థమవుతుంది. రాజకీయాల్లో 40 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఓ తెలుగు చానల్‌తో మాట్లాడిన ఆయన అనేక విషయాలు ముచ్చటించారు. అందులో భాగంగా ఆయన రాజకీయాల్లో తన సక్సెస్ సీక్రెట్ ఒకటి చెప్పారు.

40 ఏళ్ల తన రాజకీయ జీవితంలో ఎన్నడూ హత్యా రాజకీయాలు చేయలేదని.. తన మనుషులను చంపేసినా కూడా వారి కుటుంబాలకు ధైర్యం చెప్పి, వారి తరఫున న్యాయపరంగా పోరాడానే కానీ హత్యకు హత్య అన్న పద్ధతిలో వెళ్లలేదని.. అందుకే ఇంతకాలం నాయకుడిగా ఉండగలిగానని అన్నారు. హత్యకు హత్య అనుకుని ఉంటే అదెన్నటికీ ఆగదని.. పరిటాల రవి వంటి నేతను చంపేసినప్పుడు కూడా తాను అలాంటి ఆలోచన చేయలేదని అన్నారు. నమ్ముకున్న ప్రజలకు న్యాయం చేయడంపైనే దృష్టి సారించానే తప్ప అలాంటి రాజకీయాలు ఎన్నడూ చేయలేదని చెప్పారు.

హింస అనేది తన జీవితంలోనే లేదని, స్టూడెంట్స్‌ పాలిటిక్స్‌ చేశాను కానీ విధ్వంసాలు చేయాలేదని చంద్రబాబు అన్నారు. విద్యార్థిగా ఉన్నప్పుడు మీకేమైనా సరదాలు ఉన్నాయా అని అడిగిన ప్రశ్నకు చంద్రబాబు పై విధంగా సమాధానం ఇచ్చారు. తనకు సిగరేట్‌, మందు అలవాటు లేదని చెప్పారు. సామాజిక న్యాయం కోసమే పనిచేశానే కానీ, హత్యరాజకీయాలను తానెప్పుడూ ప్రోత్సహించలేదని పేర్కొన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories