గురువారం ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం

గురువారం ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం
x
Highlights

గురువారం మ‌ధ్యాహ్నం 2 గంటలకు సిఎం చంద్ర‌బాబు అధ్య‌క్ష‌త‌న ఏపి మంత్రి వ‌ర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ప్రధానంగా పెథాయ్ తుఫాన్ ప్ర‌భావం.. దాంతోపాటు...

గురువారం మ‌ధ్యాహ్నం 2 గంటలకు సిఎం చంద్ర‌బాబు అధ్య‌క్ష‌త‌న ఏపి మంత్రి వ‌ర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ప్రధానంగా పెథాయ్ తుఫాన్ ప్ర‌భావం.. దాంతోపాటు ప్ర‌జ‌ల‌కు అందుతున్న సాయంపై చర్చ జరగనుంది. కాగా పెథాయ్ తుఫాన్ ప్ర‌భావంతో ఇప్పటివరకు 60 వేల ఎక‌రాల్లో పంట‌న‌ష్టం జరిగిందని ప్రభుత్వం అంచనా వేస్తోంది.

అలాగే గ‌డిచిన నాలుగున్న‌ర ఏళ్ల‌ టీడీపీ పాలనలో అమ‌లు చేసిన అభివృద్ది, సంక్షేమం, మౌళిక వ‌స‌తులు, రాజ‌ధాని, విద్యుత్, నీటి పారుద‌ల ప్రాజెక్ట్ లు వంటి కీలకాంశాలపై రాష్ట్ర ప్ర‌భుత్వం శ్వేత పత్రాలు విడుదల చెయ్యాలని ప్రభుత్వం భావిస్తోంది. అగ్రిగోల్డ్, అలాగే ఈ నెలలో క‌డ‌ప‌లో స్టీల్ ప్లాంట్ కు శంకుస్థాప‌నపై కూడా మంత్రివర్గ సమావేశంలో చర్చ జరగనున్నట్టు సమాచారం.

Show Full Article
Print Article
Next Story
More Stories