ఊసరవెల్లి కూడా సిగ్గుపడేలా...

ఊసరవెల్లి కూడా సిగ్గుపడేలా...
x
Highlights

ఊసరవెల్లి కూడా సిగ్గుపడేలా రాష్ట్ర రాజకీయాలున్నాయని బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ అన్నారు. అప్పుడు ఇప్పుడు కాంగ్రెస్‌తో చేతులు కలిపి తన...

ఊసరవెల్లి కూడా సిగ్గుపడేలా రాష్ట్ర రాజకీయాలున్నాయని బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ అన్నారు. అప్పుడు ఇప్పుడు కాంగ్రెస్‌తో చేతులు కలిపి తన మామకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని ఆరోపించారు. అధికార దాహం తప్ప చంద్రబాబుకు రాష్ట్ర అభివృద్ధి పట్టడం లేదని కన్నా లక్ష్మినారాయణ విమర్శించారు. చంద్రబాబు స్టాట్యూ ఆఫ్‌ ఆపర్చునిటీగా మారారని 2019 ఎన్నికల్లో టీడీపీ భూస్థాపితం కావడం తథ్యమని కన్నా జోస్యం చెప్పారు. నాడు మోదీని దేవుడన్నారని ఇప్పుడు నిందిస్తున్నారన్నారు. సోనియాను కూడా చంద్రబాబు గతంలో తిట్టారని గుర్తుచేశారు. చంద్రబాబు యూటర్న్‌ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని చంద్రబాబు దిగజార్చుతున్నారని కన్నా లక్ష్మీనారాయణ దుయ్యబట్టారు.

Show Full Article
Print Article
Next Story
More Stories