ఆర్సీబీ విజయం.. అనుష్క 'కమాన్‌ బాయ్స్‌'..

ఆర్సీబీ విజయం.. అనుష్క కమాన్‌ బాయ్స్‌..
x
Highlights

కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు దుమ్ము రేపారు.. సన్ రైజర్స్ పై గెలిచి ప్లే అఫ్ కు అర్హత సాధించారు. ముందుగా బ్యాటింగుకు...


కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు దుమ్ము రేపారు.. సన్ రైజర్స్ పై గెలిచి ప్లే అఫ్ కు అర్హత సాధించారు. ముందుగా బ్యాటింగుకు దిగిన ఆర్సీబి నిర్ణీత 20 ఓవర్లలో 218 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. ఏబీ డివిలియర్స్‌ (39 బంతుల్లో 69; 12 ఫోర్లు, 1 సిక్స్‌), మొయిన్‌ అలీ (34 బంతుల్లో 65; 2 ఫోర్లు, 6 సిక్స్‌లు) రాణించారు. అనంతరం బరిలోకి దిగిన సన్‌రైజర్స్‌ 204 పరుగులు చేసి తృటిలో గెలుపుని మిస్ చేసుకుంది. దీంతో కోహ్లీ సేన 14 పరుగుల తేడాతో విజయం సాధించింది..ఈ క్రమంలో ప్లే ఆఫ్ కు అర్హత సాధించారు. ఇక ఆర్సీబీ గెలవడంతో కోహ్లీ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. అందులో కోహ్లీ సతీమణి అనుష్క శర్మ అయితే ఎగిరి గంతేసింది. మ్యాచ్ చూడటానికి రాకపోయినా ఇంట్లో టీవీ ముందు కూర్చుని బెంగుళూరు కొట్టే షాట్లను ఆహ్లాదంగా వీక్షించారు. మ్యాచ్‌ ఆసాంతం సోషల్‌ మీడియాలో కమాన్‌ బాయ్స్‌.. అంటూ వరుస పోస్ట్‌లతో ఆర్సీబీకి మద్దతు తెలిపింది.

Show Full Article
Print Article
Next Story
More Stories