ఏపీలోని కాపులకు మరో గుడ్ న్యూస్

ఏపీలోని కాపులకు మరో గుడ్ న్యూస్
x
Highlights

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కాపు సామాజిక వర్గ డ్రైవర్లకు గుడ్ న్యూస్ చెపుతుంది. ఓనర్లు కావాలనుకునే కాపు సామాజికవర్గ డ్రైవర్ల కోసం ప్రభుత్వం సువర్ణావకాశం...

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కాపు సామాజిక వర్గ డ్రైవర్లకు గుడ్ న్యూస్ చెపుతుంది. ఓనర్లు కావాలనుకునే కాపు సామాజికవర్గ డ్రైవర్ల కోసం ప్రభుత్వం సువర్ణావకాశం కల్పిస్తోంది. కాపు సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్‌ లిమిటెడ్‌, విజయవాడ, ఎన్టీఆర్‌ ట్రస్టు వారి సమన్వయంతో ఈ పథకం అమలు చేస్తుంది చంద్రన్న ప్రభుత్వం. ఈ అవకాశాన్ని రాష్ట్రంలోని కాపు తెలగ, బలిజ, ఒంటరి కులాల అభ్యర్థులు వినియోగించుకోవచ్చు.

ఈ పధకం ద్వారా ప్రతి కాపు, బలిజ సామాజిక వర్గానికి చెందిన వారు ప్రతి నెలా రూ. 15 వేల ఆదాయం పొందే అవకాశం ఉంది. కాపు కార్పొరేషన్‌ ద్వారా రూ. లక్ష రూపాయల సబ్సిడీ రుణం, ఎన్టీఆర్‌ ట్రస్టు ద్వారా రుణం పొందే అవకాశం కల్పించారు. ఆసక్తిగల అభ్యర్థులు దరఖాస్తును ఆన్‌లైన్‌ వెబ్‌సైట్‌లో పొందవచ్చునని బీసీ కార్పొరేసన్‌ ఈడీ నాగముని శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ పధకానికి అర్హులైన అభ్యర్థులు... కాపు సామాజికవర్గానికి చెందిన వారై, డ్రైవింగ్‌ లైసెన్స్‌ కలిగి ఉండాలన్నారు. లబ్ధిదారుడి వాటా కింద రూ. లక్ష రూపాయలు వెచ్చించాల్సి ఉంటుందన్నారు. సంవత్సర ఆదాయం రూ. 6 లక్షలకు మించకుండా ఉండాలన్నారు. అన్ని అర్హతలు ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాల కోసం బీసీ కార్పొరేషన్‌ కార్యాలయంలో సంప్రదించవచ్చునన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories