తెలుగు రాష్ట్రాల మధ్య ఆరోగ్యకరమైన పోటీ!

తెలుగు రాష్ట్రాల మధ్య ఆరోగ్యకరమైన పోటీ!
x
Highlights

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను రెండు రాష్ట్రాలుగా విభజించిన తర్వాత.. ఆస్తులు, పంపకాల గొడవలు ఎలా ఉన్నా.. అభివృద్ధిలో మాత్రం.. రెండు రాష్ట్రాల్లో ఆరోగ్యకరమైన...

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను రెండు రాష్ట్రాలుగా విభజించిన తర్వాత.. ఆస్తులు, పంపకాల గొడవలు ఎలా ఉన్నా.. అభివృద్ధిలో మాత్రం.. రెండు రాష్ట్రాల్లో ఆరోగ్యకరమైన పోటీ కనిపిస్తోంది. చాలా విషయాల్లో.. రెండు రాష్ట్రాలు మంచి ఫలితాలు సాధిస్తున్నాయి. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో కేంద్రం ఇచ్చిన ర్యాంకుల్లో ఓ సారి రెండు రాష్ట్రాలు కలిసి అగ్రస్థానాన్ని సాధించడం చూసి.. తెలుగువాళ్లుగా అంతా గర్వపడ్డారు.

ఇప్పుడు మరో విషయంలో.. మన రెండు రాష్ట్రాలు.. ప్రత్యేక ఘనతను సాధించాయి. ఇప్పుడు ప్రపంచానికి అత్యంత కీలకమైన ఇంటర్నెట్ వేగంలో.. దేశంలోనే హైదరాబాద్ మూడో స్థానంలో నిలిచింది. తర్వాత.. నాలుగో స్థానాన్ని బీచ్ సిటీ విశాఖపట్నం దక్కించుకుంది. ప్రపంచ వ్యాప్తంగా ఇంటర్నెట్ స్పీడ్ టెస్ట్ ను గణించే ఊక్లా సంస్థ.. ఈ అధ్యయనం చేసింది. ఇందులో.. మన దక్షిణ భారతానికే చెందిన చెన్నైకి మొదటి స్థానం.. తర్వాత బెంగళూరుకు రెండో స్థానం దక్కాయి. మొత్తం దేశంలోని 20 నగరాల్లో ఈ అధ్యయనం జరిగింది.

మరో విషయం ఏంటంటే.. ప్రపంచ వ్యాప్తంగా మన దేశానికి ఇంటర్ నెట్ స్పీడ్ విషయంలో.. సగటున 20.72 ఎంబీపీఎస్ సగటుతో 67వ స్థానం దక్కింది. ఇందులో.. 161.53 ఎంబీపీఎస్ వేగంతో.. సింగపూర్ మొదటి స్థానంలో ఉంది. అంటే.. ప్రపంచంతో పోలిస్తే.. ఇంకా ఈ విషయంలో మనం మెరుగవ్వాల్సింది చాలా ఉందన్న వాస్తవం.. తాజా అధ్యయనంతో ప్రభుత్వాలకు అవగతంలోకి వచ్చింది.

Show Full Article
Print Article
Next Story
More Stories