టీడీపీ ఎంపీల‌కు ఘోర అవ‌మానం..!!?

టీడీపీ ఎంపీల‌కు ఘోర అవ‌మానం..!!?
x
Highlights

గత కొన్ని రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యేక హోదా ఉద్యమం జోరుగా సాగుతుంది. కేంద్రం ఏపికి ప్రత్యేక హోదా ఇవ్వబోమని స్పష్టం చేసిన తర్వాత ప్రజలు,...

గత కొన్ని రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యేక హోదా ఉద్యమం జోరుగా సాగుతుంది. కేంద్రం ఏపికి ప్రత్యేక హోదా ఇవ్వబోమని స్పష్టం చేసిన తర్వాత ప్రజలు, ప్రజాప్రతినిధులు అంతా ఒకే నినాదం..ప్రత్యేక నినాదం. ఇప్పుడు అధికార పార్టీ అయిన టీడీపీ పార్లమెంట్ లో నిరసనలతో హోరెత్తిస్తున్నారు. ప్రతిపక్ష పార్టీ అయితే ఏకంగా ఎంపీలతో రాజీనామాలు కూడా చేయించారు. పార్లమెంట్ లో ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అంటూ టీడీపీ ఎంపీలు నిరసన తెలుపుతున్న విషయం తెలిసిందే.
ఎంపీ శివప్రసాద్ అయితే రక రకాలు వేషధారణలతో నిరసనలు తెలుపుతూ వస్తున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాను డిమాండ్ చేస్తూ..న్యూఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ నివాసం ఎదుట ధర్నాకు దిగిన తెలుగుదేశం ఎంపీలను ఢిల్లీ పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో అక్కడ పోలీసులు కనీసం ఎంపీ స్థాయి నాయకులు అని కూడా చూడకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డిని పోలీసులు లాగి పడేశారు.
ప్రధాని ఇంటి ముట్టడికి టీడీపీ ఎంపీలు యత్నించగా, వారి నిరసనల గురించి ముందుగానే తెలుసుకున్న పోలీసులు భారీగా మోహరించడంతో పాటు ఆ ప్రాంతంలో బారికేడ్లను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో ఎంపీలు అశోక్ గజపతిరాజు, గల్లా జయదేవ్, సీఎం రమేష్, మురళీ మోహన్, రామ్మోహన్ నాయుడు తదితరులంతా ప్రధాని నివాసం వద్దకు చేరుకోగా, వారిని పోలీసులు అడ్డుకున్నారు.
అయితే ప్రధాని నివాసం వద్ద నిషేదిత ప్రాంతం అని పోలీసులు హెచ్చరించారు..కానీ టీడీపీ ఎంపీలు అదేమీ లెక్కచేయకపోవడంతో బలవంతంగా అదుపులోకి తీసుకుని బస్సులో అక్కడి నుంచి తుగ్లక్ రోడ్ పోలీస్ స్టేషనుకు తరలించారు. అరెస్టులతో తమను ఆపలేరని, రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై తమ పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని ఈ సందర్భంగా సీఎం రమేష్ హెచ్చరించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories