ఎస్‌ఐ రాత పరీక్ష నేడే.. నిమిషం లేటైనా నో ఎంట్రీ

ఎస్‌ఐ రాత పరీక్ష నేడే.. నిమిషం లేటైనా నో ఎంట్రీ
x
Highlights

ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా నేడు ఎస్ఐ (సబ్ ఇన్ స్పెక్టర్ల) ప్రాథమిక రాతపరీక్ష నిర్వహించబడుతుంది. ఎస్ఐ పరీక్ష కోసం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఏడు నగరాల్లో...

ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా నేడు ఎస్ఐ (సబ్ ఇన్ స్పెక్టర్ల) ప్రాథమిక రాతపరీక్ష నిర్వహించబడుతుంది. ఎస్ఐ పరీక్ష కోసం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఏడు నగరాల్లో 240 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం 334 పోస్టులకు 1.34 లక్షల మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఈ పరీక్షను రెండు పేపర్లుగా నిర్వహించనున్నారు. ఉదయం 10గంటల నుండి 1 గంటకు ఒక పేపర్, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పేపర్‌-2 ముగుస్తుంది. బయోమెట్రిక్‌ విధానంలో అభ్యర్థుల హాజరు సేకరించనున్నారు. నిముషం ఆలస్యమైనా అనుమతించేది లేదన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories