ఆంధ్రప్రదేశ్‌లో అవినీతి తక్కువే! సర్వే చెప్పిన సత్యం

ఆంధ్రప్రదేశ్‌లో అవినీతి తక్కువే! సర్వే చెప్పిన సత్యం
x
Highlights

దేశంలో అవినీతి తక్కువగా ఉన్న రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్‌ మూడో స్థానంలో నిలిచింది. ఈ అంశంలో గుజరాత్‌, కేరళలు మొదటి రెండు స్థానాల్లో...

దేశంలో అవినీతి తక్కువగా ఉన్న రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్‌ మూడో స్థానంలో నిలిచింది. ఈ అంశంలో గుజరాత్‌, కేరళలు మొదటి రెండు స్థానాల్లో ఉండగా..తమిళనాడు, పంజాబ్‌, ఉత్తరప్రదేశ్‌లు అట్టడుగు స్థానంలో నిలిచాయి. ట్రాన్స్‌పెరెన్సీ ఇంటర్నేషనల్‌ ఇండియా, లోకల్‌ సర్కిల్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్వహించిన ఇండియన్‌ కరప్షన్‌ సర్వే-2018 ఈ విషయాన్ని వెల్లడించింది.

నోయిడాకు చెందిన ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్ సంస్థ ఇండియా కరెప్షన్ సర్వే 2018 పేరిట సర్వే నిర్వహించింది. దేశంలోని మొత్తం 13 రాష్ట్రాల్లో ఆన్‌లైన్‌ సర్వే చేపట్టింది. అవినీతి నిరోధక సవరణ బిల్లు -2018 ఇటీవల పార్లమెంటులో ఆమోదం పొందిన నేపథ్యంలో ఈ ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. దిల్లీ, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, పంజాబ్‌, రాజస్థాన్‌, తమిళనాడు, తెలంగాణ, ఉత్తరప్రదేశ్‌, పశ్చిమబెంగాల్‌, గుజరాత్‌, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో సర్వే నిర్వహించారు. మొత్తం 13 రాష్ట్రాల్లోని 215 జిల్లాల నుంచి 50 వేల మంది నుంచి ప్రజాభిప్రాయాన్ని సేకరించారు. వారి నుంచి 1.60 లక్షల స్పందనలు వచ్చాయి. సర్వేలో అభిప్రాయం వ్యక్తపరిచిన వారిలో 33 శాతం మంది మహిళలు, 67 శాతం మంది పురుషులు ఉన్నారు.

అవినీతి, లంచాల వ్యవహారాలపై ఫిర్యాదు చేసేందుకు మీ రాష్ట్రంలో ప్రత్యేక హాట్‌లైన్‌ వ్యవస్థ ఉందా? అవినీతి నిరోధానికి మీ రాష్ట్ర ప్రభుత్వాలు గతేడాదిలో ఎలాంటి చర్యలు తీసుకున్నాయి? ఏయే శాఖల అధికారులుకు ఎక్కువగా లంచాలు చెల్లిస్తున్నారు? గతేడాది కాలంలో ప్రభుత్వాధికారులతో పనులు చేయించుకోవడానికి లంచం చెల్లించారా? లంచాలను ఎక్కువగా ఏ రూపంలో చెల్లిస్తున్నారు? వంటి పలు ప్రశ్నలకు సమాధానాలు ఆన్‌లైన్‌లో సేకరించారు.
వాయిస్ 3 : ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్ చేపట్టిన సర్వే ప్రకారం 43 శాతం మంది తెలంగాణ ప్రజలు ప్రభుత్వ పనులు చేయించుకోడానికి ఎప్పుడో ఒకప్పుడు లంచం చెల్లించామని చెప్పారు. ఏపీలో 38 శాతం మంది మాత్రమే ప్రభుత్వ సేవలకు లంచం చెల్లించామని చెప్పారు. ఆస్తుల రిజిస్ట్రేషన్, పోలీసు శాఖకు సంబందించి ఎక్కువ మంది లంచాలు ఇచ్చుకోవాల్సి వచ్చిందని తెలిసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories