తీవ్రరూపం దాల్చిన వాయుగుండం.. తుఫాను 'దయే'

తీవ్రరూపం దాల్చిన వాయుగుండం.. తుఫాను దయే
x
Highlights

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్రరూపం దాల్చింది. దీని ప్రభావంతో నిన్న రాత్రి నుంచి పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే తీరం వెంబడి బలమైన...

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్రరూపం దాల్చింది. దీని ప్రభావంతో నిన్న రాత్రి నుంచి పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే తీరం వెంబడి బలమైన ఈదురు గాలులు ప్రారంభమయ్యాయి. గంటకు 60 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. కాగా ఈ తుఫానుకు 'దయే' అని మయన్మార్‌ నామకరణం చేసింది. దయే తుఫాను మరికొద్ది గంటల్లో ఇచ్ఛాపురం, గోపాల్‌పూర్‌ మధ్య తీరం దాటే అవకాశమున్నట్టు విశాఖ వాతావరణ కేంద్రం చెబుతోంది. ప్రస్తుతం ఇది కళింగపట్నానికి 160 కి.మీ. కేంద్రీకృతమైంది. ఈ తుఫాను తీరం దాటే సమయంలో కోస్తాంధ్ర, తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశమున్నట్టు తెలుస్తోంది. అలాగే సముద్రం అల్లకల్లోలంగా ఉన్నందున మత్స్యకారులు వేటకు వెళ్లోద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. వర్షాల నేపథ్యంలో పలు జిల్లాల ఎస్పీలతో ఇన్‌చార్జి డీజీపీ హరీశ్‌కుమార్‌ గుప్తా టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories