నెల్లూరు టీడీపీలో ముసలం..నేడో రేపో పార్టీ మారనున్న మాజీ మంత్రి

నెల్లూరు టీడీపీలో ముసలం..నేడో రేపో పార్టీ మారనున్న మాజీ మంత్రి
x
Highlights

నెల్లూరు జిల్లా టీడీపీలో ముసలం మొదలయింది.. నెలక్రితమే పార్టీ మారాలని నిర్ణయించుకున్న మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రస్తుతం ఆ దిశగా ప్రయత్నాలు...

నెల్లూరు జిల్లా టీడీపీలో ముసలం మొదలయింది.. నెలక్రితమే పార్టీ మారాలని నిర్ణయించుకున్న మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రస్తుతం ఆ దిశగా ప్రయత్నాలు ఆరంభించారు. బంధువులు, కార్యకర్తలు పార్టీ మారాలని ఆనంపై ఒత్తిడి తెస్తున్నారు. దీంతో ఆదివారం సాయంత్రం రామనారాయణ రెడ్డి కార్యకర్తల మీటింగ్ ఏర్పాటు చేశారు. మెజారిటీ కార్యకర్తలు వైసీపీలో చేరాలని సూచిస్తున్నారు. దీంతో రామనారాయణరెడ్డి దాదాపు పార్టీ మారాలని నిర్ణయించుకున్నారు. దీనిపై ఇప్పటికే వైసీపీ సీనియర్ నేతలైన బొత్స, విజయసాయిరెడ్డి, ధర్మాన లతో సంప్రదింపులు జరిపినట్టు తెలుస్తోంది. గతకొంత కాలంగా టీడీపీలో సరైన ప్రాధాన్యత లేదని మధనపడుతున్న అయన నేడో రేపో జగన్ సమక్షంలో వైసీపీలో చేరాలని అనుకుంటున్నట్టు సమాచారం. మరోవైపు ఆనం పార్టీ మారతారని ఊహాగానాలనేపథ్యంలో మంత్రులు సోమిరెడ్డి, నారాయణలు అయనతో సంప్రదింపులు జరుపుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories