logo
ఆంధ్రప్రదేశ్

విద్యార్థిని ఆత్మహత్య..

విద్యార్థిని ఆత్మహత్య..
X
Highlights

నీట్‌ శిక్షణా విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన విశాఖపట్టణంలో చోటుచేసుకుంది. విజయనగరం జిల్లా...

నీట్‌ శిక్షణా విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన విశాఖపట్టణంలో చోటుచేసుకుంది. విజయనగరం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలానికి చెందిన మర్రి సాంబమూర్తి పనిచేస్తున్నారు. సుధారాణి దంపతులకు అమృత, ఆదర్శ సంతానం. అమృతను ఈ నెల 9న విశాఖలోని గ్రావిటీ అకాడమీలో నీట్‌లో లాంగ్‌టర్మ్‌ శిక్షణ కోసం చేర్పించారు.శనివారం దుస్తులు మార్చుకోవడానికని ఓ గదిలోకి వెళ్లి గడియ పెట్టుకుంది. ఏమైందో ఏమో ఆమె ఆత్మహత్య చేసుకుంది. అమృత ఎంతకీ బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన సహచర విద్యార్థినులు అకాడమీ మేట్రిన్ కు సమాచారం ఇచ్చారు.కానీ మేట్రిన్ భయంతో తలుపులు తెరవకుండా పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు తలుపు విరగ్గొట్టి చూడగా అప్పటికే అమృత మరణించింది. కాగా ఘనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆమె హత్యకు గల కారణాలు తెలియలేదు. ఇక కుమార్తె ఆత్మహత్యతో తల్లిదండ్రులు శోకసముద్రంలో మునిగిపోయారు. 'అసలు ఏమి జరిగిందో తమకు చెప్పకుండా..ఎంత పనిచేశావమ్మా.. నీకెంత కష్టం వచ్చిందమ్మా..' అంటూ రోధించారు.

Next Story