బాబు అలిగారు.. షా ఫోన్ చేసి రమ్మన్నారు

బాబు అలిగారు.. షా ఫోన్ చేసి రమ్మన్నారు
x
Highlights

ఆంధ్రప్రదేశ్ కు కేంద్రం సహాయం విషయంలో.. కేంద్రం అనుసరిస్తున్న వైఖరిపై సీఎం చంద్రబాబు కాస్త ఆగ్రహంగా కనిపిస్తున్న విషయం తెలిసిందే కదా. ఈ విషయంపై...

ఆంధ్రప్రదేశ్ కు కేంద్రం సహాయం విషయంలో.. కేంద్రం అనుసరిస్తున్న వైఖరిపై సీఎం చంద్రబాబు కాస్త ఆగ్రహంగా కనిపిస్తున్న విషయం తెలిసిందే కదా. ఈ విషయంపై కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నుంచి కాస్త కదలిక వచ్చినట్టే కనిపిస్తోంది. ఈ నెల 5న ఓ ప్రతినిధి బృందాన్ని పంపిస్తే.. కేంద్రం ఏం చేసింది.. ఇంకా చేయాల్సింది ఏం ఉంది అన్న విషయాలపై చర్చిద్దామంటూ చంద్రబాబుకు.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఫోన్ చేశారట.

అందుకే వెంటనే అంగీకరించిన చంద్రబాబు.. తమ పోరాటం బీజేపీపై కాదనీ.. కేవలం నిర్లక్ష్యంగా ఉన్న కేంద్రం తీరుపైనే అని చెప్పారట. అమిత్ షా సూచించినట్టు.. సుజనాచౌదరి, రామ్మోహన్ నాయుడు, కుటుంబరావుతో కూడిన బృందాన్ని ఢిల్లీకి పంపేందుకు ఒప్పుకున్నట్టుగా కూడా తెలుస్తోంది. దీంతో.. బీజేపీ ఏది చెబితే.. అందుకు చంద్రబాబు సై అన్నట్టుగానే కనిపిస్తోంది.

దక్షిణాదిలో బలపడాలని భావిస్తున్న బీజేపీకి.. ఇప్పుడు టీడీపీ తోడు అత్యవసరం. ఆ పార్టీ లేకుంటే.. మరిన్ని పార్టీలు బీజేపీతో కలిసి నడిచేందుకూ సిద్ధంగానే ఉన్నా.. అధికారంలో ఉన్న పార్టీ కావడంతో.. ఇప్పటికిప్పుడు టీడీపీతో గొడవలు పెట్టుకునేందుకు బీజేపీ ఇష్టపడడం లేదు. అందులో భాగంగానే.. బాబు తో కాస్త మెతకగా వ్యవహరిస్తున్నట్టు కనిపిస్తోంది. అందుకే బాబు అలా అలిగినట్టు తెలియగానే ఇలా షా కాల్ చేసినట్టు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories